మోడీ దెబ్బకు నల్లబజార్ల తెల్లమొహం

Update: 2016-11-09 10:20 GMT
    జీరో బిజినెస్ లకు కేంద్ర బిందువులైన మార్కెట్లు దేశంలో ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ లోని బేగం బజారు కూడా అలాంటివాటిలో ఒకటి. మామూలుగా అయితే బేగం బజారులో పాదం మోపడానికి ఖాళీ ఉండదు. కొనే వస్తువును ఎంచుకోవడానికి అవకాశమూ ఉండదు.. అక్కడ దొరకని సరకూ ఉండదు. బేగం బజార్ అంటే టోటల్ హైదరాబాద్ కే కాదు చుట్టు పక్కల ప్రాంతాలకూ అన్ని రకాల వస్తువులకూ హోల్ సేల్ మార్కెట్. అగ్గిపెట్టెల్లాంటి దుకాణాల్లోనే గల్లా పెట్టెలు పొంగిపొర్లేలా వ్యాపారం జరుగుతుందక్కడ. అలాంటి బేగం బజారు ఇప్పుడెలా ఉందో తెలుసా..? ఖాళీగా మారిపోయింది. ఎక్కడా వ్యాపారాలు సాగడం లేదు. కారణం... పెద్ద నోట్ల రద్దు.

మోడీ తీసుకున్న ఈ నిర్ణయంతో బేగం బజారు బోరు మంది.. ఒక్క బేగం బజారే కాదు, ఎంటైర్ ఓల్డ్ సిటీలో బిజినెస్ లు చల్లబడిపోయాయి. ఓల్డ్ సిటీ, బేగం బజారుల్లో ఎక్కువగా జీరో బిజినెస్సే జరుగుతుంటుంది. ఎంత వ్యాపారం జరుగుతుందో లెక్కలుండవు. కార్డు పేమెంట్లు వంటివి చాలా తక్కువ. అంతా క్యాష్ ట్రాన్జాక్షన్లే. ఇప్పుడు క్యాష్ కి చెక్ పెట్టడంతో అక్కడి వాతావరణం గప్ చుప్ అయింది.

ఒక్క బేగం బజారు పరిధిలోనే లక్ష కోట్లకు పైగా నగదు లావాదేవీలు జరుగుతుంటాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అక్కడ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నా ప్రభుత్వానికి సమకూరే ఆదాయం మాత్రం అంతంతమాత్రం. మరోవైపు ఓల్డ్ సిటీలో నకిలీ నోట్లూ ఎక్కువే. అక్కడ ఉగ్రవాద జాడలు ఉండడంతో నకిలీ నోట్ల బెడద ఉంది. తాజా పరిణామాలు ఇలాంటి దందాల్లో ఉన్నవారందరికీ దిక్కుతోచకుండా చేశాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News