పవన్ సభకు ‘మోడీ’ దెబ్బ

Update: 2016-11-10 05:33 GMT
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఉద్యమ బరిలోకి దిగినట్లుగా ప్రకటించిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. మరికాసేపట్లో అనంతపురంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘‘సీమాంధ్ర హక్కుల చైతన్య సభ’’ పేరిట అనంతపురం పట్టణంలో ఏర్పాటు చేస్తున్నసభకు భారీగా జనం పోటెత్తుతారని భావిస్తున్నారు. అయితే.. అనుకోని రీతిలో చోటు చేసుకున్న పరిణామాలు పవన్ సభపై ప్రభావం చూపుతాయన్న మాట వినిపిస్తోంది. ఒకవిధంగా చెప్పాలంటే పవన్ సభకు మోడీ దెబ్బ పడే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

పెద్ద నోట్ల చెలామణిని రద్దు చేస్తే ప్రధాని మోడీ మంగళవారం రాత్రి సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో.. భారీ సభకు వచ్చే జనంపై ప్రభావాన్ని చూపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాని ప్రకటించిన నిర్ణయం కారణంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవటం.. సగటు జీవి నుంచి ఆగర్భ శ్రీమంతుడి వరకూ చేతిలో డబ్బులు లేక కటకటలాడిపోతున్న పరిస్థితి. ఉన్న డబ్బులుచెల్లుబాటు కాకపోవటం.. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినా పరిమితంగా వస్తున్న క్రమంలో.. నాలుగు రూపాయిలు తీసి ఖర్చు చేయటం గతంలో మాదిరి ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పవన్ మీద ఎంత అభిమానం ఉన్నప్పటికీ ఊళ్ల నుంచి రావటానికి కానీ.. సభకు వచ్చే సందర్భంలో అయ్యే దారి ఖర్చులకు సంబంధించిన నగదు ఇబ్బంది ఉన్న క్రమంలో పెద్దనోట్ల రద్దు ప్రభావం సభ మీద పడుతుందా? అన్నది ఇప్పుడుప్రశ్నగా మారింది. దీంతో పాటు.. ప్రజలంతా తమ దగ్గరి డబ్బును కొత్త నోట్లకు మార్చుకునేందుకు బిజీబిజీగా ఉన్న వేళ.. ఈ హడావుడిలో సభ మీద ఎంతమేర దృష్టి పెడతారన్నది కూడా సందేహంగా మారినట్లుగా చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News