భార‌త రియ‌ల్ ఎస్టేట్‌ కి భారీ కుదుపు!

Update: 2016-11-09 11:36 GMT
న‌ల్ల ధ‌నంపై పోరు సాగిస్తానంటూ 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన అప్ప‌టి బీజేపీ ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థి.. న‌రేంద్ర మోడీ ఆ హామీని నెర‌వేర్చే క్ర‌మంలో ఇప్పుడు షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నారు. మోడీ తీసుకున్న " బ్లాక్ " బ‌స్ట‌ర్ డెసిష‌న్‌ తో స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ టైప్‌ లో క‌రెన్సీ స్ట్రైక్స్ ప్రారంభించారు. ఈ ప‌రిణామం దేశాన్ని ఒక్క కుదుపు కుదిపింది. ప్ర‌స్తుతం చ‌లామ‌ణిలో ఉన్న పెద్ద నోట్లు మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి 12 గంట‌ల నుంచి ర‌ద్ద‌య్యాయి. ఈ అనూహ్య నిర్ణ‌యం.. దేశ‌వ్యాప్తంగా  పెద్ద పెద్ద ఇండ‌స్ట్రీల‌ను కుదిపేస్తోంది.

ముఖ్యంగా దేశంలో ప్ర‌ధాన సెక్టారులుగా ఉన్న మైనింగ్‌ - రియ‌ల్ ఎస్టేట్‌ - కార్పొరేట్ సంస్థ‌లు కుదేల‌య్యాయి. అదేవిధంగా మూవీ ఇండ‌స్ట్రీ కూడా భారీ ఎత్తున క‌ష్టాలు ఎదుర్కోనుంది. వాస్త‌వానికి న‌ల్ల కుబేరుల‌కు మోడీ ప్ర‌భుత్వం అనేక అవ‌కాశాలు ఇచ్చింది. వారివ‌ద్ద ఉన్న న‌ల్ల ధ‌నాన్ని వెల్ల‌డించి వైట్ మ‌నీగా మార్చుకోవాల‌ని విజ్ఞ‌ప్తుల మీద విజ్ఞ‌ప్తులు చేసింది. 45 % టాక్స్ క‌ట్టి న‌ల్ల‌ధ‌నాన్ని వైట్ చేసుకోవాల‌ని అటు ప్ర‌ధాని మోడీ - ఇటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంయుక్తంగా ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ఊహించ‌ని దెబ్బ త‌గులుతుంద‌ని కూడా హెచ్చ‌రించారు.

ఏదో కేసులు న‌మోదు చేసి ఊరుకుంటార‌ని అంద‌రూ భావించారు. నిన్న సాయంత్రం 7 గంట‌ల త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌ట‌న చేసే వ‌ర‌కు దేశంలో ప్ర‌ధాని, రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్‌ - ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వంటి పెద్ద త‌ల‌కాయ‌ల‌కు ఒక‌రిద్ద‌రికి త‌ప్ప ఎవ‌రికీ కరెన్సీ స్ట్రైక్స్ గురించి తెలియ‌లేదు.దీంతో దేశం మొత్తం నివ్వెర‌పోయింది.

కాగా.. కేంద్రం తీసుకున్న చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యం బ్లాక్ మ‌నీని అరిక‌డుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.  అదేవిధంగా వివిధ భారీ ప‌రిశ్ర‌మ‌ల్లోకి ప్ర‌వ‌హిస్తున్న న‌ల్ల‌ధ‌న ప్ర‌వాహాల‌కు అడ్డుక‌ట్ట ప‌డుతుంద‌ని తెలుస్తోంది. దీనిలో మ‌న తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఉన్నా ఆశ్చ‌ర్య పోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఎందుకంటే.. ప‌లు ప్రొడ్యూసింగ్ కంపెనీల నిర్మాత‌లు ఇప్పుడు రియ‌ల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ఈ క్ర‌మంలో రియ‌ల్ ఎస్టేట్ రంగంపై ఈ ప్ర‌భావం పడ‌నుంది.

అదేవిధంగా కార్పొరేట్ మైనింగ్ సెక్టార్‌ లో కూడా భారీ ఎత్తున లెక్క‌లు చూప‌ని న‌గ‌దు ప్ర‌వ‌హిస్తోంది. దీనికి కూడా తాజా నిర్ణ‌యం ముకుతాడు వేయ‌నుంది. ఈ క్ర‌మంలో భార‌త మార్కెట్‌ ల‌లో రానున్న కొద్ది రోజులు సూచీలు నేల‌మ‌ట్ట‌మ‌య్యే ప‌రిస్థితి ఉంది. అయితే, ఇది భ‌విష్య‌త్తులో మంచిదేన‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో భ‌విష్య‌త్తులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఊపంద‌కునే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News