అన్నదాతలపై ఎరువుల పిడుగు

Update: 2021-04-09 03:54 GMT
కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు ప్రతీది మార్కెట్లో భారం అయిపోయింది. ఉప్పు పప్పు, నూనే నుంచి ఏదీ సామాన్యుడికి అందకుండా పోతోంది. ఇక అన్నదాతలపై కూడా ఇప్పుడు పెను భారం పడుతోంది. ముడిసరుకులు, పెట్రో ధరల పెంపు ప్రభావం ఎరువులపై పడింది. అది ఇప్పుడు రైతులపై పిడుగులా మారింది.

ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ముందే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచాలని కంపెనీలు నిర్ణయించడమే దీనికి కారణం అని చెబుతున్నారు.ఈ మేరకు టోకు వ్యాపారులు సైతం ధరలను పెంచేశారు.

దాదాపు 58శాతం వరకు అన్నింటి ఎరువుల ధరలు భారీగా పెంచేశారు. మొదలే సాగు వ్యయం పెరిగి.. పండిన పంటలకు మద్దతు ధర దొరకని పరిస్థితుల్లో నానా ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు ఈ నిర్ణయం శరాఘాతంగా మారింది.

ఇప్పటిదాకా డీఏపీ 50 కిలోల బస్తా ధర రూ.1200 ఉండగా.. పెరిగిన ఉత్పత్తి వ్యయంలో రూ.1900 అవుతుందని ‘ఇఫ్కో’ కంపెనీ వ్యాపారులకు తెలిపింది. ఈనెల 1 నుంచి సరఫరా అయ్యే వాటికి  ఈ కొత్త ధరలు వర్తించనుంది. ఇతర కంపెసనీలు కూడా ధరలు పెంచుతున్నట్టు జిల్లా వ్యాపారులకు సమాచారం అందించారు. అన్ని కంపెనీలు రూ.1200 నుంచి ధరలనురూ.1700 పెంచాయి.

తాజా పెంపుతో సాగువ్యయం విపరీతంగా పెరగనుంది. ప్రస్తుతం వేసవిలో పంటల సాగు లేనందున ఈ ప్రభావరం ఖరీఫ్ పై తీవ్రంగా పడనుంది.

ఏపీలో ఖరీఫ్ , రబీ సీజన్లకు 18.50 లక్షల టన్నుల ఎరువులు వాడుతారు.. తెలంగాణలో రెండు సీజన్లకు 13 లక్షల టన్నులు వాడుతారు. ఎరువుల ధరల పెంపు వల్ల ఎకరాకు రూ,4వేల నుంచి రూ.5వేల వరకు అదనపు భారం రైతులపై పడనుంది.
Tags:    

Similar News