రాజకీయ పార్టీ పెట్టనున్నట్లుగా ప్రకటించిన ప్రముఖ సినీ నటుడు.. విశ్వ కథానాయకుడు కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజుకో ఆసక్తికర వ్యాఖ్య చేస్తున్న ఆయన తాజాగా మరో వ్యాఖ్య చేశారు. ఉగ్రవాదాన్ని హిందువులు గట్టిగా వ్యతిరేకించలేని పరిస్థితి ఏర్పడిందని.. ఎందుకంటే హిందువుల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం.
ట్విట్టర్ లో ట్వీట్లతో పాటు.. తమిళ పత్రికకు వ్యాసాలు రాస్తున్న కమల్ హాసన్.. తనదైన శైలిలో చెలరేగిపోతున్నారు. ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు పెద్ద ఎత్తున చర్చకు తెర తీస్తున్నాయి. ఇందులో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. హిందువులు ఉగ్రవాదాన్ని గట్టిగా వ్యతిరేకించలేని పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో హిందువులు ఏదైనా సమస్య వస్తే చర్చ ద్వారా పరిష్కరించుకునే వారన్నారు.
అయితే.. ఇప్పుడు అందుకు భిన్నంగా హిందువులు వ్యవహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు చర్చల పద్దతికి స్వస్తి పలికి హింసకు దిగుతున్నారన్నారు. బలప్రదర్శన ఒక్కటే మార్గమని హిందువుల్లోని అతివాదులు నిర్ణయానికి వచ్చినట్లుగా ఉందన్నారు.
హిందుత్వ వ్యతిరేకత వ్యాఖ్యలు కమల్ నోటి నుంచి రావటం చూస్తుంటే.. ఆయన వామపక్ష రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్నారా? అన్న సందేహం కలగక మానదు. హిందూ ఉగ్రవాదాన్ని కేరళ అడ్డుకుందని.. తమిళనాట హిందూ సంస్థల దాడులు పెరిగినట్లుగా కమల్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే.. వామపక్ష భావజాలానికి కమల్ వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు. చూస్తూ.. చూస్తూ మెజార్టీల మనసుల్నిఇబ్బంది పెట్టేలా కమల్ వ్యాఖ్యలుఎందుకు ఉన్నాయన్నది కాలం మాత్రమే సరిగా డిసైడ్ చేస్తుందని చెప్పక తప్పదు.