రంగుల ప్రపంచంలో క్రియేటివిటీని ఎంతగా ఆవిష్కరిస్తే అంతగా కాసుల వర్షం కురుస్తుంది. సోషల్ మీడియా జమానాలో దీనిని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకునే మోడల్స్.. స్టార్లకు కొదవేమీ లేదు. అయితే ఇలాంటి ఫ్యాషన్ సెన్స్ క్రియేటివిటీ పరంగా ఇతరులతో పోలిస్తే ఒక ఆకు ఎక్కువే తింది ఉర్ఫీ జావేద్. అయితే సదరు మోడల్ కం నటి ఇప్పుడు అనూహ్యంగా చిక్కుల్లో పడింది. చంపేస్తామంటూ ప్రత్యర్థుల నుంచి బెదిరింపులను ఎదుర్కొంది. ఈ బెదిరింపులతో తాను తీవ్రంగా కలత చెందానని నటి కం మోడల్ ఉర్ఫీ జావేద్ ఆవేదన వ్యక్తం చేసింది.
లోతుగా వివరాల్లోకి వెళితే... ఉర్ఫీ జావేద్ ఇన్ స్టా సంచలనంగా ఇటీవల కుర్రకారు మనసుల్ని దోచిన సంగతి తెలిసిందే. సదరు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ తనదైన విలక్షణత విచిత్రమైన డ్రెస్సింగ్ స్టైల్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. తనని తాను మీడియాలో లైమ్ లైట్ లో ఉంచుకోవడమెలానో ఈ అమ్మడికి బాగా తెలుసు.
నిరంతరం తన ఇన్ స్టాగ్రామ్ లో రకరకాల వెరైటీ దుస్తులను ధరించి ఫోటోలను పోస్ట్ చేసి హాట్ టాపిక్ గా మారుతోంది. వరుస ఫోటోషూట్లతో కుర్రకారుకు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది. తద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా భారీగా ఫాలోవర్లను పెంచుకుని సంపాదనను అమాంతం పెంచుకుంది. నిరంతరం ప్రకటనల్లో నటిస్తూ లక్షల్లో ఆర్జిస్తోంది. కానీ తన వైఖరికి ఇప్పుడు సదరు నటి కం మోడల్ ఒక పెను సమస్యలో పడింది.
ప్రముఖ యూట్యూబర్.. సామాజిక కర్త హిందుస్తానీ భావు ఉర్ఫీ డ్రెస్సింగ్ స్టైల్ పై వ్యాఖ్యానిస్తూ తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఊర్ఫీ తనను తాను గొప్ప ఫ్యాషన్ డిజైనర్ గా భావిస్తుందని.. ఇది భారతీయ సంస్కృతి -సంప్రదాయానికి విరుద్ధమని ఘాటుగా విమర్శించారు. అయితే వెంటనే హిందుస్థానీ బావుకి ప్రత్యుత్తరం ఇస్తూ.. ఉర్ఫీ ఇలాంటి చెడు మాట్లాడితే కటకటాల వెనక్కి నెట్టగలనని కౌంటర్ వేసింది. తన డ్రెస్సింగ్ సెన్స్ పై వ్యాఖ్యానించిన వారందరి గురించి ఉర్ఫీ తన అసంతృప్తిని తెలిపింది.
తనను చంపేస్తానని బెదిరింపులు కూడా వచ్చాయని అది తనను మానసికంగా కలవరపెట్టిందని ఆమె వెల్లడించింది. ఎవరు ఎలా బెదిరించినా.. ఏం జరిగినా తాను మాత్రం ఎవరికీ హాని చేయలేదని పేర్కొంది. బెదిరింపులు తనను శారీరకంగా ప్రభావితం చేస్తున్నాయని .. ఇలాంటి భయపెట్టే ప్రకటనలు ఆమోదయోగ్యం కాదని ఉర్ఫీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉర్ఫీ జావేద్ వరుస బోల్డ్ ఫోటోషూట్లు అంతర్జాలంలో సంచలనం రేపుతున్నాయి. ఇప్పటివరకూ బిగ్ బాస్ లో పాల్గొన్న ఏ ఇతర పార్టిసిపెంట్ ఇంతగా బోల్డ్ కంటెంట్ తో చెలరేగింది లేదు. కానీ ఉర్ఫీ ఏ విషయంలోను తగ్గేదేలే! అంటూ చెలరేగుతోంది. నిరంతరం వివాదాల్లో నలుగుతోంది. ఇప్పుడు హత్యా బెదిరింపులను ఎదుర్కొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.