క్రిస్మస్​ ట్రీ..! వెనక హిస్టరీ ఏంటో తెలుసా!

Update: 2020-12-24 00:30 GMT
క్రైస్తవులు ముఖ్య పర్వదినం క్రిస్మస్​.. అయితే ఈ పండగ రోజు అందరి ఇళ్లల్లో మనకు క్రిస్మస్​ ట్రీ కనిపిస్తుంది. చర్చిల్లో కూడా ఈ ట్రీ ని మనం చూస్తుంటాం. విద్యుత్​ దీపాల కాంతిలో ఈ చెట్టు మెరిసిపోతూ ఉంటుంది. అయితే ఆ చెట్టును ఎందుకు అలంకరిస్తారు.. దాని వెనక ఉన్న చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. క్రిస్మస్​ చెట్టు గురించి అనే కథలు వ్యాప్తిలో ఉన్నాయి. అయితే వాటిలో ఎక్కువగా చెప్పుకొనే కథ ఏమిటంటే..

క్రీస్తుశకం ఎనిమిదో శతకంలో సెయింట్‌ బోనీఫస్‌ ఓ సారి జర్మనీకి వెళ్లారు. అయితే జర్మనీలో ఉండే ఆదివాసులు అక్కడ ‘ఓక్’ అనే ఓ చెట్టును పూజించేవారట. ఆ చెట్టును దైవంగా భావించి దానికి నరబలులు కూడా ఇచ్చేవారట. అయితే ఈ దురాచారాన్ని ఎలాగైనా రూపుమాపాలని బోనిఫస్​ భావించి.. నరబలులు చేయొద్దని వాళ్లకు చెప్పారట. మనుషులను పాపవిముక్తులను చేయడానికి ఏసు జన్మించారని.. అందుకే మీరంత ఓక్​ వృక్షానికి నరబలులు ఇవ్వడం ఆపేసి.. ఏసుకు ప్రియమని ‘ఫర్’​ చెట్టును పూజించాలని ఆదివాసులకు చెప్పాడట.

ఆ చెటు కొమ్మలను అలంకరించి దాన్ని పూజించాలని చెప్పాడట.. అప్పటి నుంచే ఫర్​ చెట్టు క్రిస్​మస్​ ట్రీగా మారిందని ఓ కథ చెప్పుకుంటారు. ​అయితే క్రిస్​మస్​ చెట్టుపై మరో కథ కూడా ప్రచారంలో ఉంది. క్రిసమస్​ రోజున క్రైస్తవులంతా చర్చికి వెళ్లి అక్కడ కానుకలు సమర్పించడం ఆనవాయితీ. అయితే ప్లాబో అనే పేదకుర్రాడు కూడా చర్చికి వెళ్లాడు. అయితే బహుమతిగా తీసుకెళ్లడానికి అతడి దగ్గర ఏమీ లేదు. దీంతో అతడి ఇంటి వద్ద ఉన్న ఓ చిన్న చెట్టును చర్చికి బహుమతిగా తీసుకెళ్లాడు. అక్కడున్న మిగతా వాళ్లంతా ప్లాబోను అతడు తీసుకొచ్చిన చెట్టును చూసి ఎగతాళి చేశారు. ప్లాబో కూడా సిగ్గుతో తలదించుకున్నాడు.

కానీ అంతలోనే ఆ చెట్టు ఓ బంగారం వృక్షంగా మారింది. దాని నుంచి అనేక బంగారు వస్తువులు బయటకు వచ్చాయి. దీంతో అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఏసుకు తీసుకెళ్లే బహుమతి ఏదన్నది ముఖ్యం కాదని.. ఎంత మంచి మనసుతో తీసుకెళ్లామన్నాదే ముఖ్యమని అక్కడ ఫాదర్​ వాళ్లకు చెప్పారు. అందుకే అప్పటినుంచి క్రిస్​మస్​ ట్రీని పూజిస్తారన్న కథ కూడా ఉంది. 1832లో ప్రొఫెసర్‌ చార్లెస్‌ ఫోలెన్‌ క్రిస్మస్‌ ట్రీని క్యాండిల్‌ దీపాలతో అలంకరించాడు. అయితే 1882 నుంచి విద్యుత్​ దీపాలతో అలంకరించడం మొదలైంది.


క్రిస్మస్​ ట్రీ.. మరిన్ని విశేషాలు..


క్రిస్మస్​ ట్రీ కోసం అమెరికా వాళ్లు ఏటా ఏడాదికి 1.8 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పదిలక్షల ఎకరాల్లో క్రిస్మస్‌ చెట్లను పెంచుతున్నారు. అతిపెద్ద క్రిస్మస్‌ చెట్టు వెల్లింగ్టన్‌లోని హీల్లన్‌ పార్క్‌లో ఉంది.. 120 చదరపు అడుగులు విస్తరించి ఉన్న ఈ చెట్టు ఎత్తు 91 అడుగులు.. క్రిస్మస్‌ పండుగ రోజున ఈ చెట్టును బంగారు..వెండి ఆభరణాలతో.. విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. అత్యంత విలువైనది అబుదాబిలోని ప్యాలస్‌ హోటల్‌లో ఉంది.. 40 అడుగుల ఎత్తున్న ఆ క్రిస్మట్‌ ట్రీ విలువ కోటి పది లక్షల డాలర్లు. 181 వజ్రాలు.. పగడాలు.. కెంపులు ఇలా నవరత్నాలతో దీన్ని అలంకరించారు.
Tags:    

Similar News