మానవ పరిణామక్రమంలో కీలకమైన నియాండర్తల్స్ జాతి ఎందుకు అంతమైపోయిందన్నది ఒక పెద్ద మిస్టరీ. మనిషి ఎక్కడ నుంచి వచ్చాడు? వారి పరిణామ క్రమం ఎలా సాగింది? లాంటి అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. 40 వేల సంవత్సరాల క్రితం మనుగడలో ఉన్న నియాండర్తల్స్ జాతి ఎలా అంతర్థానమైంది? దానికి కారణం ఏమిటి? అన్నది ఇప్పటికి ఒక మిస్టరీనే. దీన్ని ఛేదించేందుకు పెద్ద ఎత్తున పరిశోధనలు జరిగాయి. తాజాగా ''పీఎన్ఓఎస్ వన్'' అనే జర్నల్ లో దీనికి సంబంధించిన ఆసక్తికర విశ్లేషణ ఒక చేశారు.
ఈ అధ్యం షాకింగ్ నిజాల్ని వెల్లడించినట్లు చెబుతున్నారు. మనుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవటమే ఆ జాతి అంతమైపోవటానికి కారణమైందని చెబుతున్నారు. అయితే.. ఇది జరగటానికి వేల ఏళ్లు పట్టింది. ఇంతకీ నియాండర్తల్స్ జాతి ఏమిటి? వారి ప్రత్యేకత ఏమిటి? అన్న విషయంలోకి వెళితే ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి. ఆధునిక మానవుడికి ముందటి తరంగా వీరిని చెప్పాలి. మనుషులకు.. నియాండర్తల్స్‌కు దగ్గర పోలికలు చాలానే ఉన్నాయి. వారి పుర్రె.. శరీర నిర్మాణం ఒకేలా ఉంటుంది. మనుషులకు వారికి మధ్య డీఎన్ఏ కూడా 99.7 శాతం కలుస్తుంది. వారి ప్రవర్తన కూడా మనుషుల మాదిరే ఉంటుంది. మనుషుల మాదిరి వారు కూడా నిప్పును పుట్టించారు. మరణించిన వారిని ఖననం చేయటం తెలిసిందే. తమపై దాడి చేసే వారిపై ప్రతిదాడి చేసేవారు. సముద్రపు చిప్పలు.. గవ్వలు.. జంతువుల దంతాల్ని ఉపయోగించి అభరణాల్ని ధరించే వారు. మనుషుల్లాగే రాతి మీద బొమ్మలు వేసేవారు.
వీరు మంచి నైపుణ్యం ఉన్న వేటగాళ్లు. ఆహారం కోసం కొండ గొర్రెలు.. దుప్పిలు.. అడవి దున్నలు.. ఖడ్గ మృగాలు లాంటి జంతువుల్ని వేటాడి.. వాటిపై పదునైన ఆయుధాల్ని సంధింస్తూ చంపేసేవారు. వారిమీదా.. వారి కుటుంబాల మీద ఎవరైనా దాడికి దిగితే వారితో గొడవ పడేవారు. దీనికి సంబంధించిన గొడవలు అప్పట్లో జరిగినట్లుగా చెబుతారు. సుమారు లక్ష ఏళ్ల క్రితం ఆధునిక మానవుల విస్తరణను ప్రతిఘటించారు. ఆదిమ మానవులు 2లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి బయటకు వచ్చినా.. నియాండర్తల్స్ నివసించిన భూభాగాన్ని ఆక్రమించేందుకు దాదాపు లక్షన్నర ఏళ్లు పట్టినట్లుగా చెబుతారు.
ఇదిలా ఉంటే ఈ జాతి అంతం కావటానికి మనుషులతో వారు పెట్టుకున్న లైంగిక సంబంధాలుగా చెబుతున్నారు. అదెలానంటే.. వారి రక్త నమూనాల్ని చూసినప్పుడు వారి రక్తం నిర్దిష్ట జన్యువైవిధ్యాల్ని కలిగి ఉన్నట్లు గుర్తించారు. వారికి ''హెమోలిటిక్ డిసీజ్ ఆఫ్ ది ఫీటెస్ అండ్ న్యూబార్న్'' (హెచ్ డీ ఎఫ్ఎన్)బలహీనత ఉందని.. అది రక్తహీనతను పెంచుతుందని.. సాధారణంగా రెండు.. మూడు ప్రెగ్నెన్సీలతో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుందని భావిస్తున్నారు. మనుషులు.. నియాండర్తల్ మధ్య లైంగిక సంబంధాలతో ఈ అరుదైన రక్త రుగ్మత ఆ జాతిని అంతమొందించినట్లు చెబుతున్నారు.