హిట్ మ్యాన్ లగ్జరీ లైఫ్.. రోహిత్ సంపాదన ఎంతో తెలుసా?

Update: 2021-05-17 23:30 GMT
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చాలా పాపులర్. టీం ఇండియా క్రికెటర్లలో కోహ్లీ తర్వాత ఈయనే. మైదానంలో బ్యాట్ తో బాల్ ని రప్ఫాడించే ఈయన... సంపాదనలోనూ అదరగొడుతున్నాడు. వివిధ రకాల వాణిజ్య ప్రకటనల ద్వారా రూ.కోట్లను తన ఖాతాలో పోగు చేసుకుంటున్నాడు. ఈయనకు బీసీసీఐ A+ కాంట్రాక్టు కేటాయించింది. ఫలితంగా ఏడాదికి రూ.7 కోట్లు ఈయన ఖాతాలో జమ కానున్నాయి. వీటితో పాటు మ్యాచ్ ఫీజు అధికంగానే ఉంటుంది.

టెస్ట్ మ్యాచ్ కు రూ.15 కోట్లు, వన్డేకి రూ.6, టీ-20కి 3 లక్షలు ఆయనకు అందుతాయి. ఐపీల్ ద్వారా హిట్ మ్యాన్ కు బాగానే ముడుతున్నాయి. ముంబయి ఇండియన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ కు ఆ యాజమాన్యం ఏడాదికి రూ.15 కోట్లు జమ చేస్తుంది. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆడినందుకు రోజుకూ రూ.35 వేలు తీసుకుంటాడు.

సీచ్ టైర్స్,నాయిస్, డ్రీమ్ -11, ట్రాక్సాస్ వంటి వంటి ప్రకటనలకు రాయబారిగా వ్యవహరిస్తూ కోట్లు ఆర్జిస్తున్నాడు. వీటి ద్వారా దాదాపు రూ.60 నుంచి 70 కోట్లు సమకూరుతాయని ఓ అంచనా. సినిమా షూటింగుల్లో పాల్గొంటే అదనంగా రోజుకో రూ.కోటి ముట్టాల్సిందే. ఇవన్నీ కలుపుకొని రోహిత్ ఆదాయ నెట్ వర్త్ రూ. 170 కోట్లు ఉంటుందని ఓ అంచనా.

ముంబయిలోని ధనిక ప్రదేశమైన వోర్లిలో ఓ ఖరీదైన ఇల్లు ఉంది. ఈయన ఉండే ఇల్లు 6000 స్క్వేర్ ఫీట్లతో ఉండి... 270 డిగ్రీల్లో అరేబియా సముద్రమే కనిపిస్తుంది. 29 ఫ్లోర్లతో ఉన్న ఈ భవనం వెల రూ. 30 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈయనకు అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. తొలుత స్కోడాలారా, టయోటా ఫార్చునర్, బీఎండబ్లూ ఎక్స్ 3, బీఎండబ్లూ ఎమ్5 కార్లు కొన్నాడు.  హిట్ మ్యాన్ సంపాదన, లగ్జరీ జీవితం నిజానికి అందరికీ ఆసక్తిగా మారింది. 
Tags:    

Similar News