సాధారణంగా పిల్లలను దత్తత ఇస్తుంటారు, లేదా గ్రామాన్ని దత్తత ఇస్తుంటారు. కానీ, హైదరాబాద్ నగరంలో రహదారి పిల్లర్లను దత్తత ఇచ్చేందుకు హెచ్ ఎండీఏ రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. నగరంలో మరేచోట లేని విధంగా పిల్లర్లపై వర్టికల్ గార్డెన్ ల ఏర్పాటుకు హెచ్ ఎండీఏ ప్రణాళికలు రచిస్తోంది.
బెంగళూరు నగరంలోని ఎలక్ర్టానిక్ సిటీ రోడ్డులో ఉన్న ఫ్లైఓవర్ కు వర్టికల్ గార్డెన్ ను ఇప్పటికే ఏర్పాటు చేశారు. అదే తరహాలో హైదరాబాద్ లోనే అతి పొడవైన పీవీ ఎక్స్ ప్రెస్ వే రహదారి పిల్లర్లను దత్తత ఇవ్వాలని కొద్ది రోజులుగా హెచ్ ఎండీఏ యోచిస్తోంది. బెంగుళూరు గార్డెన్ ను ఏర్పాటు చేసిన సంస్థతో కలిసి హెచ్ ఎండీఏ అధ్యయనం చేపట్టింది. పీవీ ఎక్స్‌ప్రెస్ వే పొడవునా 317 పిల్లర్లు ఉన్నాయి. వర్టికల్ గార్డెన్ ఏర్పాటు కోసం ఒక్కో పిల్లర్ కు రూ.3.20 లక్షలు ఖర్చవుతుందని అంచనా.
ఈ విధంగా మొత్తం 317 పిల్లర్ల ఏర్పాటుకు సుమారు రూ.10.14 కోట్లు ఖర్చవుతుంది. ప్రస్తుతం ఆ ఖర్చును భరించే స్థితిలో హెచ్ ఎండీఏ లేదు. దీంతో, పిల్లర్లను ప్రైవేటు కంపెనీలకు దత్తత ఇస్తే ఆ ఖర్చును అవే భరిస్తాయి. దాని వల్ల సంస్థపై ఆర్థిక భారం పడదు. అంతే కాకుండా పీవీ ఎక్స్ ప్రెస్ మార్గంలో పచ్చదనం పెంపొందుతుంది. అత్యంత రద్దీ ప్రాంతంగా మా రిన ఈ మార్గంలో పచ్చదనం కావాలంటే పిల్లర్లకు వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేయడమే సరైందని అభిప్రాయపడుతున్నారు.
వర్టికల్ గార్డెన్ ల ఏర్పాటులో అనుభవం ఉన్న సేవ్ ట్రీ సంస్థతో కలిసి పనిచేసేందుకు హెచ్ ఎండీఏ ఏర్పాట్లు చేస్తోంది. వీటి ఏర్పాటుతో నగరంలో వేడి వాతావరణానన్ని, వాయు కాలుష్యా న్ని తగ్గించనుంది. ఆ పిల్లర్లపై పక్షులు, కీటకాలు ఆరోగ్యకరమైన నివాసాలను ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. ఈ గ్రీన్ వాల్స్ ఏర్పాటు వల్ల జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకోవచ్చని అధికారులంటున్నారు.