లాఠీ దాడిపై హోంమంత్రి ఆగ్రహం.. ఎస్సై సస్పెండ్‌

Update: 2020-03-27 06:27 GMT
కరోనా నివారణకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈక్రమంలో తమ లాఠీలకు పని చెబుతున్నారు. లాక్‌ డౌన్ - కర్ఫ్యూ ఉన్నా కొందరు బయట తిరుగుతూ నిబంధనలు ఉల్లంఘిస్తుండడంతో వారిపై పోలీసులు లాఠీలతో కొడుతూ వారిని తరిమివేస్తున్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన లాఠీ దాడి మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంటి దగ్గర ఉన్న కుటుంబసభ్యులను పోలీసులు వచ్చి ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఓ కుటుంబాన్ని ఎస్సై కక్షతోనే దాడి చేశారని చెబుతూ ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది.

పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఖండవల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఉన్న కుటుంభసభ్యులను చూసిన పోలీసులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. వారు సమాధానం చెప్పేలోపే లాఠీకి పని చెప్పారు. ముఖ్యంగా ఎస్సై దాడి చేశాడు. తామేమి నిబంధనలు ఉల్లంఘించలేదని.. చెబుతుండగా తనకే ఎదురు సమాధానం చెబుతావా ఎస్సై మరింత ఆగ్రహంతో లాఠీతో తీవ్రంగా కొట్టాడు. తండ్రిపై దాడి చేయడంతో అతడి తనయుడు పోలీసులను ఎదురించాడు. దీంతో తండ్రితోపాటు తనయుడిపై కొట్టాడు. ఆ తర్వాత వారి కుటుంబంలోని మహిళలపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించారు. దీంతో పోలీసులు నెమ్మదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. పేదలను కొట్టమని జగన్‌ ఆదేశించారా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా దాడి చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది.

అయితే ఈ ఘటన హోం మంత్రి మేకతోటి సుచరిత దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై వివరాలు తెలుసుకుని ఎస్సై తప్పు ఉండడంతో అతడిని సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీస్‌ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News