వేలెత్తి చూపించేందుకు సైతం వీల్లేకుండా ఉండేలా వ్యవహారాలు నడిపిస్తారన్న పేరు ప్రఖ్యాతులు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కు చెరందిన ఎన్జీవో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంస్థకు దిమ్మ తిరిగే షాకిచ్చేలాంటి నిర్ణయాన్ని ప్రకటించింది కేంద్ర హోంశాఖ.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ ను కేంద్ర ప్రభుత్వం తాజాగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విదేశీ నిధుల్ని స్వీకరించే విషయంలో పాటించాల్సిన రూల్స్ ను ఇన్ఫోసిస్ ఎన్జీవో పాటించలేదన్నది తాజా అభియోగం. ఎన్జీవో ఏదైనా సరే విదేశాల నుంచి విరాళాలు పొందాలంటే తప్పనిసరిగా ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ కింద రిజిస్టర్ అయి ఉండాలి.
అంతేకాదు.. రిజిస్టర్ అయిన ఎన్జీవోలు ఏడాదికేడాది తమ వార్షిక ఆదాయం.. విదేశీనిధుల వ్యయాలు.. బ్యాలెన్స్ షీట్ లాంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఫారిన్ నుంచి ఎలాంటి నిధులు అందని పక్షంలో నిల్ రిటర్న్ లు అందచేయాల్సి ఉంది.
అయితే.. ఈ విషయంలో ఇన్ఫోసిస్ నిబంధనల ప్రకారం చేయాల్సిన పనులేమీ చేయలేదని చెబుతున్నారు. అంతేకాదు.. రూల్స్ ను పాటించని వైనానికి కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసినా సంస్థ స్పందించలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 1996లో ప్రారంభించిన ఈ ఎన్జీవోకు ఇన్ఫోసిస్ సుధామూర్తి ఛైర్ పర్సన్ గా ఉన్నారు. అలాంటి మహిళ నేతృత్వంలో ఉన్న సంస్థ రిజిస్ట్రేషన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పక తప్పదు.