మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు రాబోతోన్నాయి. దీంతో, కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆకర్షించేందుకు సరికొత్త పథకాలను - సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోదీ సర్కార్ కు మరో ఏడాదే గడువుండడంతో నిరుద్యోగులంతా....ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, తాజాగా వారందరికీ మోదీ సర్కార్ షాకిచ్చింది. గత 5 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను రద్దు చేయాలని కేంద్రం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. అంతేకాదు, ఏఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయో తెలపాలంటూ మంత్రిత్వ శాఖలను ఆదేశించింది.
ఈ ఉద్యోగాల రద్దుపై అన్ని మంత్రిత్వ శాఖలు - విభాగాల నుంచి యాక్షన్ రిపోర్టును కోరామని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని శాఖల అదనపు కార్యదర్శులు - సహాయ కార్యదర్శులు - పారామిలటరీ దళాల చీఫ్ - ఇతర సంబంధిత సంస్థల అధికారులకు సర్కార్ ఆదేశాలు జారీ చేసిందని హోం మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఈ నివేదిక సమర్పించాల్సిందిగా సంబంధిత విభాగాలను గతంలోనే కోరినట్టు కేంద్రం తెలిపింది. అయితే అన్ని శాఖల నుంచి సమగ్ర నివేదిక రాకపోవడంతో తాజా ఆదేశాలు జారీ చేసింది. జనవరి 16 - 2018 తేదీన తాజా మెమోరాండం జారీ చేసినట్టు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత 5 సంవత్సరాల కాలం నుంచి కొన్ని వేల కేంద్ర ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. మరి, ఈ నేపథ్యంలో నిరుద్యోగులందరూ ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు.