చైనాతో యుద్ధానికి పంపండి ...రక్తాక్షరాలతో హోంగార్డ్‌ లేఖ !

Update: 2020-06-23 07:15 GMT
భారత్ -చైనా సరిహద్దు వివాదంలో భారత సైనికులను అత్యంత క్రూరంగా చంపిన చైనాపై  దేశంలోని ప్రతి ఒక్కరు రగిలిపోతున్నారు. చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళూరిపోతున్నారు. ఈ క్రమంలో తనను చైనాపై యుద్ధానికి పంపించాలని ఓ హోంగార్డ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు తన రక్తంతో లేఖ రాశాడు. ఇండియా, చైనాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగి యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండగా..ఏ క్షణానైనా యుద్ధం జరుగుతాయని వాతావరణం నెలకొంది.

ఇరు పక్షాలూ అదనపు సైన్యాలను తరలిస్తున్న వేళ, తనకు యుద్ధంలో పాల్గొనేందుకు దయచేసి అవకాశం ఇవ్వాలని కోరుతూ..కర్ణాటకలోని రాయచూరు జిల్లా మస్కి ప్రాంతానికి చెందిన హోంగార్డ్ గా పనిచేస్తున్న మడివాళ లక్ష్మణ్ హోమ్ గార్డు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రక్తంతో ఓ లేఖ రాశాడు. శనివారం వైద్యుల సలహాతో భారత్‌–చైనాల మధ్య యుద్ధం వస్తే దేశ రక్షణే కర్తవ్యంగా భావించానని, తనకు యుద్ధంలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ మూడు పేజీలతో లేఖను రాశారు.

మడివాళ లక్ష్మణ్ హోమ్ గార్డుగా పనిచేస్తూనే పలు సామాజిక సేవలు చేస్తుంటాడు. విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ ఫ్రీగానే ఇస్తుంటాడు. గ్రామంలోని పిల్లలకు దేశభక్తిని గురించి ఎన్నో కథలు చెబుతుంటాడు. దేశం కోసం మన భారత సైనికులు ఎంతగా కష్టపడుతున్నారో..వారు కుటుంబాలను వదులుకుని..ప్రాణాల్ని పణ్ణంగా పెట్టి..శతృమూకలపై ఎలా పోరాడుతుంటారో చెబుతుంటాడు.
Tags:    

Similar News