ముక్కుసూటిగా ఉంటూ.. అవినీతి అక్రమాలను ఏ మాత్రం సహించక.. వాటి కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే అధికారులు కొందరుంటారు. సినిమాల్లో కనిపించే ఇలాంటివి రియల్ లైఫ్‌లో కాస్త తక్కువే. తాజాగా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో డీకే రవి అనే ఐఏఎస్ అధికారి అనుమానాస్పద రీతిలో మరణించటం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
ఇసుక మాఫియా నుంచి ఇతనికి గత కొద్దికాలంగా బెదిరింపులు వస్తున్నాయి. 2009 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారికి నిజాయితీపరుడిగా మంచిపేరుంది. బెంగళూరు నగరంలోని కోరమంగళ ప్రాంతంలో ఉన్న సెయింట్ జాన్స్ ఉడ్స్ అపార్ట్‌మెంట్లోని తన నివాసంలో ఆయన సీలింగ్‌కు వేలాడుతూ విగతజీవుడిగా కనిపించారు.
అనుమానాస్పద మృతిగా ఈ కేసును పోలీసులు నమోదు చేశారు. ఆయన మరణంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుకమాఫియా ఆటలు కట్టించే ప్రయత్నంలో ఆయన బిల్డర్లను.. ఇసుక మాఫియా పన్ను ఎగవేతదారులను తీవ్రంగా ప్రతిఘటించారు. ఇదే ఆయన మరణానికి కారణమా అన్నది అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.