డేరా అధినేత గుర్మీత్ రామ్ రహీం సింగ్ విషయంలో మరో కలకలం తెరమీదకు వచ్చింది. డేరా బాబా ఉదంతంలో ఆయనతో సమానంగా పాపులర్ అయిన ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ సంచలన వార్తతో ఎంట్రీ ఇచ్చారు. తనకు డ్రగ్స్ మాఫియాతో ముప్పు పొంచి ఉందని తెలిపి కలకలం రేపారు. ఈ మేరకు కోర్టుకు ఆమె విన్నవించారు. గుర్మీత్ రామ్ రహీంను తప్పించేందుకు యత్నించిన కేసుతో పాటూ - పంచకులలో అల్లర్లకు కారణమైన హనీప్రీత్ కోసం వేట కొనసాగుతోంది. ఆమె ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో హనీప్రీత్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ హనీప్రీత్ ఆసక్తికరమైన వాదన వినిపించారని ఏఎన్ఐ వార్త సంస్థ పేర్కొంది. `నా ప్రాణాలకు మత్తుమాఫియాతో ముప్పుంది. అయితే నేను లొంగిపోవడానికి, విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను`` అని ముందస్తు బెయిల్ పిటిషన్ లో పేర్కొంది. ఈ రోజు భోజనవిరామం అనంతరం హనీప్రీత్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.
కాగా, ఢిల్లీలో హనీప్రీత్ తలదాల్చుకుందనే వార్తల నేపథ్యంలో పోలీసుల సోదాలు కలకలం సృష్టించాయి. గ్రేటర్ కైలాష్ లోని ఓ ఇంట్లో హనీప్రీత్ ఉన్నారనే సమాచారంతో అరెస్ట్ వారెంట్ తో పోలీసులు రైడ్ చేశారు. తెల్లవారుజామున ప్రత్యేక బృందాలు ఒక్కసారిగా ఏ-9 గ్రేటర్ కైలాష్ ను చుట్టుముట్టడంతో…స్థానికులు కంగారు పడ్డారు. అయితే పోలీసుల సోదాల్లో హనీప్రీత్ ఆచూకీ లభించకపోవడంతో వారు వెనుదిరిగారు.
కాగా, హనీప్రీత్ డేరాబాబా దత్తత కుమార్తె కాదని, ఆమె గుర్మీత్ ప్రియురాలని ఇన్సాన్ కు సంబంధించిన సంచలన విషయాలను హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా వెల్లడించారు. హనీప్రీత్ ఎన్నడూ తనతో సంసారం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. గుర్మీత్ - హనీప్రీత్ ల మధ్య అక్రమ సంబంధం ఉందని, తన అనుచరులను తప్పుదోవ పట్టించడానికి దత్తత కుమార్తె అంటూ గుర్మీత్ మాయ చేసేవాడని విశ్వాస్ చెప్పారు. డేరా అధినేతకు చెందిన గుఫా (ఆంతరంగిక మందిరం)లో వారిద్దరూ కలిసి ఉన్నప్పుడు తాను చూశానని, అయితే ఈ విషయం ఎక్కడైనా చెపితే తనను, తన కుటుంబ సభ్యులను హత్య చేస్తామని బెదిరించారని విశ్వాస్ వెల్లడించిన సంగతి తెలిసిందే.