దేశంలో కరోనా మరోసారి ఆందోళనకి గురిచేస్తుంది. రోజురోజుకీ వేలు, లక్షల్లో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో యూకే ఇండియాను ట్రావెల్ రెడ్ లిస్టులో పెట్టేసింది. కరోనా కొత్త వేరియంట్ దేశం నుంచి ఇతర దేశాలైన యూకేలో వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో యూకే ట్రావెల్ ఆంక్షలు విధించింది. అసలు కరోనా కొత్త వేరియంట్ గురించి పూర్తి వివరాలు , దేశంలో రోజురోజుకీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ను ఎలా సైంటిస్టులు ఎలా గుర్తించారు, అసలు ఈ వేరియంట్ ముందుగా ఎక్కడ మొదలైంది. అలాగే ఈ వైరస్ ఎంత ప్రమాదం అనే విషయాల్లోకి వెళ్తే ..
మన దేశంలో ముందుగా ఈ కొత్త వేరియంట్ ను గుర్తించారు. డిసెంబర్ 2020 నుంచి 2021 మార్చి మధ్య కాలంలో మహారాష్ట్రలో కొత్త వేరియంట్ విజృంభణ మొదలైంది. మార్చి 24 నాటికి మహారాష్ట్రలో 15శాతం నుంచి 20శాతానికి పైగా వైరస్ కేసులు నమోదైనట్టు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ కు మహారాష్ట్ర హాట్ స్పాట్ గా మారింది. E484Q, L425R అనే రెండు అసాధారణ మ్యుటేట్ వైరస్ లు విజృంభించాయి. ఈ కొత్త వేరియంట్ పేరు B.1.617గా సైంటిస్టులు గుర్తించారు. గత ఫిబ్రవరి నెలలో యూకేలో జెనోమిక్ సర్వైలైన్స్ భారత కరోనా కొత్త వేరియంట్ శాంపిల్స్ లో గుర్తించింది. కొన్ని కొత్త వేరియంట్ కేసులు ఇంట్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించాయి.
ఇక ఈ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరమని కచ్చితంగా చెప్పలేమని పిహెచ్ పి చెప్తుంది. కొత్త వేరియంట్లు అన్నింటిని పూర్తిగా అవగాహన చేసుకోలేమని , సైంటిస్టులు వేరియంట్ ఎంత ప్రమాదకరమో తెలుసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇతర వేరియంట్ల కంటే ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఇమ్యూనిటీని దెబ్బతీస్తోంది. పాత వైరస్ ఆధారంతో తయారుచేసిన వ్యాక్సిన్లు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదు. భారతీయ వేరియంట్ L452R.. రెండు కీలక వేరియంట్లలో ఒకటి. వ్యాక్సినేషన్ నుంచి కొన్ని యాంటీబాడీలను ఈ వేరియంట్ చంపేస్తోంది . దక్షిణాఫ్రికా వేరియంట్ కనీసం వ్యాక్సిన్లకు పాక్షికంగా పనిచేస్తుంది. భారతీయ వేరియంట్ పై మాత్రం వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేయడం లేదు. భారతీయ వేరియంట్ కేసుల సంఖ్య మార్చి 20 నుంచి రెండు వారాల్లో 0.2 శాతం నుంచి 1 శాతానికి పెరిగాయని యూకే డేటా వెల్లడించింది.