చైనాలో పుట్టిన మాయదారి వైరస్ ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో తెలిసిందే. కంటికి కనిపించని ఈ వైరస్ తమ జోలికి రాకుండా ఉండేందుకు ఇంటి పట్టునే ఉన్నోళ్లు అంతో ఇంతో సేఫ్ గా ఉంటే.. వైరస్ ను పట్టించుకోకుండా బయటకు వచ్చే వారిని మాత్రం కరోనా వదిలిపెట్టటం లేదు. లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేస్తున్న దేశాల్లో పరిస్థితి కాస్త బాగున్నా.. కట్టడి విషయంలో కంట్రోల్ గా లేని దేశాల్లో మాత్రం ప్రజలు పిట్టల మాదిరి రాలి పోతున్నారు. చూస్తుండగానే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ 38 లక్షల మందికి సోకగా.. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 2,64,811 మరణించారు.
తాజాగా యాక్టివ్ కేసులు 22,54,759గా చెబుతున్నారు. వీరిలో 48,208 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఒక్కరోజులోనే అమెరికాలో 2524 మంది మరణించటం గమనార్హం. ఇప్పటివరకూ కరోనా కారణంగా అమెరికాలో మరణించిన వారి సంఖ్య 74,795 మంది. ఈ గణాంకాల్ని చూస్తే.. రానున్న రోజుల్లో కరోనా కారణంగా లక్ష మంది అమెరికాలో మరణించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దేశ వ్యాప్తంగా కఠినంగా లాక్ డౌన్ అమలు చేసే విషయంలో ట్రంప్ సర్కారు మొదట్నించి విముఖతను ప్రదర్శిస్తూనే ఉంది.
ఆందోళన కలిగించే విషయం ఏమంటే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల్లో దాదాపు 30 శాతం అమెరికాలోనే ఉండటం గమనార్హం. బుధవారం ఒక్కరోజులోనే ప్రపంచంలోని పలు దేశాల్లో మరణించిన వారి సంఖ్య చూస్తే.. అమెరికా తర్వాత అత్యధిక మరణాలు సంపన్న దేశమైన యూకేలో చోటు చేసుకున్నాయి. ఆ దేశంలో బుధవారం ఒక్కరోజే 649 మంది మరణించారు. తర్వాతి స్థానం బ్రెజిల్. ఆ దేశంలో 645 మంది మరణిస్తే.. ఇటలీలో ఒక్కరోజులోనే 369 మంది మరణించారు. బెల్జియం (323).. జర్మనీ (282).. ఫ్రాన్స్ (278).. స్పెయిన్ (244).. మెక్సికో (236).. కెనడా (189) మంది మరణించారు. భారత్ లో బుధవారం ఒక్కరోజులోనే.. 111 మంది మరణించారు.
మరో షాకింగ్ అంశం బయటకు వచ్చింది. ప్రపంచం లోనే అత్యధికంగా కరోనా బారిన పడిన దేశంగా రానున్న రోజుల్లో అప్ఘనిస్తాన్ నిలవనుందన్న హెచ్చరికలు జారీ అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 80 శాతం మంది కరోనా బారిన పడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. 3.5 కోట్ల మంది జనాభా ఉన్న అఫ్ఘనిస్థాన్ లో సుమారు యాభై లక్షలకు పైగా జనాభా కాబూల్ లోనే ఉంది. దేశ రాజధానిలో తాజాగా నిర్వహించిన ర్యాండమ్ టెస్టులో 50 శాతం మందికి కరోనా ఉన్నట్లుగా తేలింది. దీంతో.. ఈ దేశంలో రానున్న రోజుల్లో అత్యధిక కేసులు నమోదు కావటం ఖాయమంటున్నారు.