శృంగారాసక్తి ఎవరికెక్కువ? మగాళ్లకా? ఆడవాళ్లకా?

Update: 2020-05-06 17:30 GMT
మగవారికంటే ఆడవారే ఎక్కువ సార్లు శృంగారం కోరుకుంటారా.? అయితే ఎన్ని సార్లో తెలుసా.? మహిళలతో పోలిస్తే పురుషుల్లో శృంగార వాంఛలు ఎక్కువ. మగాళ్లే ఈ విషయంలో ముందుగా చొరవ తీసుకుంటారని భావిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆడవాళ్లకు కూడా ఆ విషయం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ వారు అంత తొందరగా బయటపడరు. దీనికి చాలా కారణాలున్నాయట..

మగువలు శృంగారం కంటే ఉద్వేగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వారితో శృంగారాన్ని అస్వాదించాలంటే అప్యాయంగా మాట్లాడడం తప్పనిసరి. ఫోర్ ప్లేకు మగువలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పురుషులు ఇదేం పట్టించుకోకపోతే ఆడవారు మూడ్ లోకి రావడం కష్టమవుతుంది. దీంతో వారు అన్యమనస్కంగానే భాగస్వామికి సహకరిస్తారు. వారు సంతృప్తి చెందరు కాబట్టి లైంగిక ప్రక్రియ పట్ల అంతగా ఆసక్తి చూపరు. మగువలు తాము అనుకున్నన్ని సార్లు, తాము సంతృప్తి చెందేలా శృంగారంలో పాల్గొంటున్నారో లేదో తెలుసుకునేందుకు తాజాగా ఓ అధ్యయనం నిర్వహించారు.

మహిళలకు సంతానోత్పత్తికి సంబంధించిన ఉత్పత్తులను విక్రయించే ఓ సంస్థ ఈ అధ్యయనం చేపట్టింది. సగం మందికిపైగా మహిళలు తాము కోరుకున్నంతగా శృంగారం తనివితీరా చేయడం లేదని ఆ అధ్యయనంలో తేలింది. చాలా మంది ఆడవాళ్లు వారంలో మూడు సార్లకు పైగా శృంగారంలో పాల్గొనాలని ఆ సంస్త చేపట్టిన సర్వేలో పాల్గొన్న 75 శాతం మంది మహిళలు చెప్పారు.

మగాళ్లకంటే ఆడవాళ్లే ఎక్కువ శృంగారం కోరుకుంటారని కూడా ఆ సంస్థ వెల్లడించింది. మగాళ్లు కోరుకున్నంతగా.. ఆడవాళ్లు శృంగారాన్ని కోరుకోరనేది సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న అభిప్రాయం. కానీ తాజా అధ్యయనంలో అది తప్పని తేలింది.
Tags:    

Similar News