ఓపక్క దేశ వ్యాప్తంగా ఈ రోజు నుంచి వ్యాక్సినేషన్ ఉత్సవ్ నిర్వహించాలని.. పెద్ద ఎత్తున టీకాలు వేయాలంటూ ప్రధాని మోడీ స్వయంగా పిలుపునివ్వటం తెలిసిందే. ఉత్సవ్ వేళ.. టీకాలు లేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇప్పటికే ఏపీలో టీకా కొరత పెద్ద ఎత్తున ఉంది. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ పరిస్థితి ఏమిటన్న విషయాన్ని గణాంకాల్లో చూస్తే.. ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేవలం మూడు రోజులకు సరిపడే వ్యాక్సిన్ డోసులు ఉన్నాయి.
ఇప్పటికిప్పుడు 30 లక్షల డోసులు అత్యవసరం. వెంటనే తమకు వ్యాక్సిన్లు సరఫరా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారు. తమ వద్ద కేవలం మూడు రోజులకు సరిపడా టీకా నిల్వలు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు లక్ష నుంచి 1.15 లక్షల టీకా డోసుల్ని వినియోగిస్తున్నారు.
రానున్న రోజుల్లో దీన్ని 2 లక్షలకు పెంచాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో టీకాల కొరత వేధిస్తోంది. ఇదిలా ఉంటే.. శుక్ర శనివారాల్లో తొలి డోస్ ను లక్షకు పైనే వేశారు. సెకండ్ డోస్ కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో తొలి డోస్ తీసుకున్న వారి సంఖ్య 16.08 లక్షలు మాత్రమే. రెండో డోస్ తీసుకున్న వారు 2.90లక్షలే. ఈ లెక్కన రాష్ట్రంలో 25 శాతం జనాభాకు టీకా కార్యక్రమం పూర్తి చేయాలంటే మరెంత భారీగా వ్యాక్సిన్ డోసులు అవసరమవుతాయో ఇట్టే అర్థం కాక మానదు.