బంగారం కొనుగోలు చేయడం.. బంగారు ఆభరణాలు ధరించడం భారతీయ మహిళలకు అలవాటు. ఎంత పేద మహిళకైనా తులమో అర్ధతులమో బంగారం ఉంటుంది. ఇక మధ్య తరగతి మహిళలకైతే తులాల కొద్దీ ఉంటుంది. ఇక ధనివర్గ స్త్రీలకు కిలోల కొద్దీ బంగారం ఉంటుంది. ప్రతి వేడుకకు ఓ వినూత్న బంగారం ధరించి వెళ్తుంటారు మహిళలు. సమాజంలో మనుషులు కూడా ఎంత బంగారం ఉంటే అంత ఉన్నతమైన వ్యక్తులుగా పరిగణిస్తారు. ఇది భారతీయుల్లో ఉండే ఓ సహజ లక్షణం. ఇదిలా ఉంటే ప్రతి ఒక్కరు ఇంట్లో కిలోలు కిలోలు బంగారం ఉంచుకోవచ్చా? దీనికి చట్టం ఏం చెబుతోంది? ఇప్పుడు తెలుసుకుందాం..
నల్లధనాన్ని వెలికి తీయడంలో భాగంగా కేంద్రంలోని మోదీ సర్కారు కొన్ని ప్రత్యేక మైన చట్టాలను తీసుకొచ్చింది. అందులో భాగంగా అధిక బంగారం నిలువలు ఉండటం కూడా చట్ట విరుద్ధమే. ఆదాయపపు పన్ను చట్టం 1961లో సెక్షన్ 132 ప్రకారం ఆదాయ శాఖ అధికారులు తనిఖీలు జరిపినప్పుడు లెక్కలో లేని ఆభరణాలను లేదా ముడి బంగారాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం చెప్పినదానికంటే ఎక్కువ బంగారం ఉంటే అందుకు సంబంధించి లెక్కలు చూపించాల్సిందే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) గతంలోనే వెల్లడించింది.
ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు..
పెళ్లైన మహిళల వద్ద 500 గ్రాముల బంగారం ఉండొచ్చు. అంతకు మించి ఉంటే లెక్కలు చూపించాల్సి ఉంటుంది. పెళ్లి కాని యువతులు అయితే 250 గ్రాములు బంగారం కలిగి ఉండొచ్చు. అదే విధంగా పురుషులు కేవలం 100 గ్రాములు బంగారం మాత్రమే కలిగి ఉండాలి. ఇంతకు మించి ఎవరి దగ్గరైనా బంగారం ఉంటే కచ్చితంగా లెక్కలు చూపించాల్సి ఉంటుంది.