మనుషులు దూరమవుతున్న కొద్దీ జంతువులు మళ్లీ మనుషులకు దగ్గరవుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు పోయి పిల్లలంతా ఉద్యోగాల వేటలో చెల్లాచెదురైన వేళ ఇక పెంపుడు జంతువులే ఆ ముదిమి వయసులో వాళ్లకు దిక్కవుతున్నాయి..
ఇప్పుడు అమెరికాలో ఎవరి జీవితాలు వారివి. చిన్న కుటుంబాలే ఎక్కువ. పిల్లలు ఎక్కడో సెటిల్ అవుతుండడంతో తల్లిదండ్రులు కుక్కలు, పిల్లలు ఇతర జంతువులను పెంచుకుంటూ సేదతీరుతుంటారు.
అయితే అమెరికలో ఓ మహిళ ఓ గుర్రాన్ని పెంచుకుంది. దానితో కలిసి విమానం ఎక్కింది. విమానంలో గుర్రంతో ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
అమెరికాలోని చికాగో నుంచి ఒమహాకు వెళ్లే అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో గుర్రాన్ని చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు. ఫ్లిర్టీ అనే పెంపుడు గుర్రాన్ని దాని యజమానులు విమానంలో తీసుకెళ్లారు. యజమాని కాళ్లదగ్గరే ఆ గుర్రం పద్దతిగా కూర్చొని ఉంది. విమానంలో గుర్రాన్ని చూసి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
నిజానికి కొద్దిరోజుల క్రితం వరకూ విమానంలో పెంపుడు జంతువులను తీసుకెళ్లడం అమెరికాలో నిషేధం. కానీ అమెరికా రవాణా విభాగం ఈ మధ్య నిబంధనలు సడలించింది. పెద్ద పెద్ద జంతువులు కాకుండా చిన్న సైజు కుక్కలు - పిల్లులు - ఇతర జంతువులకు అనుమతిచ్చింది. వాటిని రిజిస్ట్రర్ చేసుకొని తీసుకెళ్లవచ్చు. కానీ ఓ మహిళ తన చిన్న సైజు పొట్టి గుర్రాన్ని రిజిస్ట్రర్ చేసుకొని తీసుకెళ్లింది. ఇప్పుడా ‘విమానంలో గుర్రం’ వీడియో వైరల్ గా మారింది.