ఇండియా లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. అయితే , వచ్చే కొద్ది రోజుల్లో థర్డ్ వేవ్ ఉద్ధృతిని కొట్టిపారేయలేమని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో రెండో దశ వైరస్ వ్యాప్తికి కారణమైన డెల్టా వేరియంట్ కొత్త రూపాంతరం, డెల్టా ప్లస్ భారత్ ను కలవరపెడుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. అయితే దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. కరోనా వైరస్ టీకాలు డెల్టా వేరియంట్‌ను సమర్థంగా నిరోధిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్ లో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు డెల్టా రకం వైరస్‌పై పనిచేస్తాయని ఎయిమ్స్ తెలిపింది.
కరోనా మహమ్మారిని అరికట్టడానికి వ్యాక్సినేషన్ ను శరవేగంగా అమలు చేస్తున్నారు. మొదటి వేవ్ చివరి దశలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా, ఆ తరువాత, ఈ వ్యాక్సిన్లను అర్హులైన అందరికీ ఇవ్వడం ప్రారంభించారు. అయితే, సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్ లపై ఈ అస్త్రాజనకా, ఫైజర్ టీకాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి అనే అంశంపై ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు చేసింది. డెల్టా, కప్పా వేరియంట్ లపై వ్యాక్సిన్లు సమర్దవంతంగా పనిచేస్తున్నాయని, అయితే, శరీరంలో యాంటీబాడీలు తగ్గిపోతున్నట్టు గమనించిన పరిశోధకులు ఇవి రీ ఇన్‌ఫెక్షన్లకు కారణం అవుతున్నాయని, వీటీపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఇక ఇండియాలో సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్‌ను అందుబాటులో ఉన్న కోవీషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని ఇప్పటికు భారత్ తెలిపింది. అయితే, రీసెంట్‌గా ఇండియాలో డెల్టా ప్లస్ వేరియంట్లు బయటపడుతుండటంతో, ఇవి ఏ మేరకు పనిచేస్తాయి అన్నది తెలియాలి.
ఇప్పటికిప్పుడు డెల్టా ప్లస్‌తో పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. మరికొందరు మాత్రం, ఈ కొత్త మ్యూటెంట్ థర్డ్ వేవ్ కు దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా డెల్టా ప్లస్ జన్యు క్రమాన్ని విశ్లేషించడంతో పాటు, దానిపై వ్యాక్సిన్ల ప్రభావశీలతను నిర్ధారించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పందించారు. దేశంలో అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. డెల్టా వేరియంట్‌పై టీకాల ప్రభావశీలత, యాంటీబాడీల వృద్ధిపై వివిధ వ్యాక్సిన్ల ప్రభావాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.