ఎక్కడ కర్ణాటక? ఎక్కడ గుంటూరు? సంబంధం లేకున్నా.. రాజకీయం మీద ఉన్న ఆసక్తి..కన్నడ ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్న ఇంట్రస్ట్ ఇప్పుడు బెట్టింగ్స్ లోకి వెళ్లేలా చేస్తోంది. మొదట్లో వన్ సైడ్ గా తర్వాత హంగ్ గా.. ఇప్పుడు బీజేపీవైపు మొగ్గు చూపేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్న మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో తమకున్న అవగాహనతో భారీ బెట్టింగ్స్ కు తెర తీశారు గుంటూరుకు చెందిన కొందరు.
మరో 24 గంటల వ్యవధిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కీలకఘట్టమైన పోలింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తి అయిన రెండు రోజులకే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే.. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయటంతో పాటు.. తెలుగోళ్లు అధికంగా ఉండే కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపును డిసైడ్ చేసే సత్తా ఉంది.
ప్రత్యేక హోదా విషయంలో మోడీ సర్కారు హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో కర్ణాటకలోని తెలుగువారు ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కాస్తా అటు తిరిగి ఇటు తిరిగి బెట్టింగ్స్ వైపు మళ్లేలా చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కర్ణాటక ఎన్నికలపై బెట్టింగ్స్ కడుతున్న వారిలో ఎక్కువ మంది బీజేపీకి దెబ్బ పడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.
తాజా ఎన్నికల్లో బీజేపీ మట్టి కరుచుకుపోవాలని.. తమను మోసం చేసిన కమలానికి పుట్టగతులు లేకుండా పోవాలన్న కసి వారిలో కనిపిస్తుండటం విశేషం. గుంటూరులో వెలుగు చూసిన బెట్టింగుల్లో ఒకరు బీజేపీ కంటే కాంగ్రెస్ కు కనీసం 5 స్థానాలు అధికంగా వస్తాయని ఒకరురూ.20లక్షల బెట్టింగ్ కాస్తే.. మరో వ్యక్తి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో 115 సీట్లకు మించి రావంటూ రూ.50లక్షలకు బెట్ కట్టటం సంచలనంగా మారింది. ఇలా.. ఎవరికి వారు భారీ బెట్టింగ్స్ జరుగుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పేరుకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలే అయినా.. దాని వేడి గుంటూరు ప్రాంతం మీద భారీగానే పడిందన్న మాట వినిపిస్తోంది.