భాగ్యనగరంలో భారీ భవంతి.. ? ఎక్కడంటే..!

Update: 2021-02-07 01:30 GMT
హైదరాబాద్​ నగరం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతున్నది. అనేక సాఫ్ట్​వేర్​ కంపెనీలు ఇక్కడ కొలువు దీరాయి. దేశంలోనే అతి పెద్ద ఐటీహబ్​గా అవతరించేందుకు హైదరాబాద్​ పరుగులు తీస్తున్నది. ఈ క్రమంలో అనేక నిర్మాణాలు హైదరాబాద్​కు మరింత శోభను తీసుకొస్తున్నాయి. ఇప్పడు హైదరాబాద్​లో అతి పెద్ద నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలోని నానక్​రాం గూడలో దాదాపు 44 అంతస్తుల భవనాన్ని నిర్మించబోతున్నారు.

దీనికోసం జీహెచ్​ఎంసీ అధికారులు అనుమతులు కూడా ఇచ్చేశారు. హైదరాబాద్​లో ఇప్పటివరకు ఇదే అత్యంత ఎత్తైన భవంతి అని నిర్వాహకులు అంటున్నారు.
ఈ భవంతిని దాదాపు ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్నారు. సుమారు రూ. 900 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
ఇప్పటికే మియాపూర్​, షేక్​పేట ఏరియాల్లో 40 అంతస్తుల బిల్డింగ్​ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ఇప్పుడు ఈ 44 అంతస్తుల భవంతి నిర్మానం పూర్తైతే జీహెచ్​ఎంసీ పరిధిలో ఇదే అత్యంత ఎత్తైన భవనంగా నిలవనున్నది. హైదరాబాద్​ రియల్​ హబ్​గా కూడా దూసుకుపోతున్నది. నగర శివార్లలో ఇప్పటికే అనేక రియల్​ వెంచర్లు అవతరించాయి. వాటిలో నిర్మాణాలు కూడా వేగం అందుకున్నాయి.


Tags:    

Similar News