ఆనందయ్య మందు తయారీలో ‘పీ’కు పెద్ద పీట.. కే..ఎఫ్..ఎల్ వద్దనే వద్దట!

Update: 2021-06-09 05:30 GMT
ఆనందయ్యను.. ఆయన తయారు చేసే ముందు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరోనాకు చెక్ పెట్టేందుకు వారు తయారు చేసే మందుల గురించి జరిగిన భారీ చర్చ తెలిసిందే. మొత్తం ఐదు రకాల మందుల్ని తయారు చేసి..ఎవరికి అవసరమైన మందును వారికి ఇచ్చేవారు ఆనందయ్య.ఎప్పుడైతే ప్రభుత్వం.. అధికారులు.. రాజకీయ నేతలు ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి ఈ మందు లెక్కలు మారిపోతున్నాయి.

ఆనందయ్య తయారు చేసే ఐదు రకాల మందుల్లో కంట్లో వేసే మందును తయారు చేయొద్దని న్యాయస్థానం చెప్పింది. దీంతో.. ఆయన తయారు చేసే కే..ఎఫ్..ఎల్.. పి.. మందుల్ని తయారు చేయాలని నిర్ణయించారు. అయితే.. నాలుగింటిలో మూడింటిని వదిలేసి.. ఒక్క ‘‘పీ’’ మందును మాత్రమే తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆనందయ్య ఒకచోట.. ఆయన కుమారుడ్ని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా తన వద్ద ఉంచుకొని మరీ ‘‘పీ’’ మందును మాత్రమే తయారు చేయాలని చెబుతున్నారట.

మిగిలిన మూడు రకాలు కరోనాతో ఇబ్బంది పడుతున్న వారికి ఉపయోగపడితే.. ప్రస్తుతం తయారు చేస్తున్న ‘‘పీ’’ రకం మాత్రం రోగ నిరోధక శక్తిని పెంపొందించటానికిసాయం చేస్తుందని చెబుతున్నారు. ఈకారణంతోనే రోగుల కంటే కూడా.. రోగ నిరోధక శక్తిని పెంచే మందు అందరికి పంపిణీ చేయటానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే దాన్ని తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. రోగం రాని వారికి మందు ఇవ్వాల్సిందే. అదే సమయంలో.. రోగంతో ఇబ్బంది పడుతున్న వారికి అవసరమైన మందును కూడా తయారు చేయించి పంపిణీ చేయిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News