చిల్లరున్నవాడే చిన్నసైజు శ్రీమంతుడు!

Update: 2016-11-09 05:12 GMT
ఒకతను ఉదయం లేచి జేబులో ఐదొందల నోటు పెట్టుకుని మార్కెట్ కి వెళ్లాడు. కొన్ని కాయగూరలు కొనుక్కుని ఐదొందల నోటు ఇచ్చాడు. విషయం తెలిసి చేశాడా - కాయగూరలమ్మేవాళ్లు కాస్త సర్దుకుని ఇస్తారులే అనుకున్నాడో తెలియదు కానీ... ఐదొందల నోటు తీసి ఇచ్చేసరికి... అవాక్కయిన కాయగూరలమ్మి - అయ్యో అది చెల్లని నోటు సారూ అంది!! ఇప్పుడెలా అని ఆలోచిస్తున్న అతనిదగ్గరకి వచ్చాడు అనుకోని అతిధి ఒకరు. మీకు చిల్లర కావాలా అని అడిగాడు... అవును కావాలి! అనగానే... ఐదొందల నోటు ఇస్తే - నాలుగు వందనోట్లు మాత్రమే వస్తాయని అన్నాడు. ఇదేమి దారుణం అని మనసుకు అనిపించినా... మరో గత్యంతరం లేక ఐదువందలకు నాలుగు వంద నోట్లు తీసుకుని గమ్మునున్నాడు! ప్రస్తుతం చాలాచోట్ల జరుగుతున్న చిల్లర బిజినెస్ ఇది!

బడా నోట్లను మార్చుకోలగమనే ధీమా ఉన్న కొంత మంది దళారులుగా మారి ప్రస్తుత స్థితిని క్యాష్ చేసుకుంటున్నారు. దళారులు పది నుంచి 20 శాతం శాతం కమిషన్ తీసుకుని చిల్లర ఇస్తున్నారు. ఇది హైదరాబాదులో జోరందుకుంది. దీంతో ఈ రూ.500 - రూ. 1000 నోట్లను రద్దు నేపథ్యంలో చిల్లర ఉన్నవాడే చిన్నసైజు శ్రీమంతుడయ్యాడైపోయాడు. ప్రతి చోటా ప్రజలు ఐదు వందలు - వేయి రూపాయల నోట్లు చెల్లకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతుండగా... తనవద్ద ఉన్న చిల్లరతో వ్యాపారాలు చేసేస్తున్నాడు. తాజాగా టోల్ ప్లాజాల వద్ద ఐదు వందలు - వేయి రూపాయల నోట్లను తీసుకోకపోవడంతో తగిన చిల్లర లేక తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇలాంటి సంఘటనలు ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ చాలా చోటు చేసుకున్నాయి.

ఇదిలా ఉండగా... బుధవారం ఉదయం సమయంలో తిరుమలలోని అన్ని కౌంటర్లలో 500 - 1000 నోట్లను టీటీడీ సిబ్బంది స్వీకరించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం విషయం తెలుసుకున్న ప్రభుత్వం దీనిపై భక్తులకు ఇబ్బంది కలగకుండా 500 - 1000 నోట్లను తీసుకోవాలని ఆదేశించడంతో టీటీడీలో అన్ని కౌంటర్లలో ప్రస్తుతం 1000 - 500 నోట్లను సిబ్బంది స్వీకరిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News