కరోనా: ఇంత మాంద్యంలోనూ శృంగారం వ్యాపారం డబుల్

Update: 2020-04-06 00:30 GMT
కరోనా అంటువ్యాధి. గాలి ద్వారా - రోగి తుమ్మినప్పుడు - దగ్గినప్పుడు.. వారి తాకిన చోట మనం తాకితే వస్తుందని చెబుతున్నారు. అలాంటి అంటు వ్యాధి ప్రబలుతున్న వేళ లాక్ డౌన్ తో ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఎవరూ బయటకు రావడం లేదు. మాస్కులతో దూరం పాటిస్తున్నారు. ఒకరినొకరు టచ్ కూడా చేసుకోవడం లేదు. షేక్ హ్యాండ్స్ - హగ్గింగ్స్ అన్ని ఆగిపోయాయి. ప్రజలు కట్టుబాట్లతో జీవిస్తున్నారు.

అయితే ఇంత కరోనా కల్లోలం ఉన్నా కూడా జనాలు లైంగిక ఆనందాలు పొందడంలో.. కరోనా అంటు వ్యాధి భయంతో భాగస్వామిని మాత్రం దూరంగా ఉంచకపోవడం చర్చనీయాంశమవుతోంది.

కరోనా టైంలో దూరం పాటిస్తారని అందరూ అనుకుంటే ఆశ్చర్యకరంగా సెక్స్ బొమ్మల అమ్మకాలు 29-40శాతం పెరగడం సంచలనమైంది. కండోమ్ ల అమ్మకం కూడా ఊహించనంతగా పెరిగిపోయింది. దీన్ని బట్టి ఖాళీగా ఉన్న జనాలు తమ భాగస్వాములతో తెగ శృంగారాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో బ్రేకింగ్ అంటే.. శృంగార సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా అమ్మకాలు కూడా పెరగడం విశేషంగా మారింది.

ప్రస్తుతం అందరూ సామాజిక దూరం పాటిస్తున్నారు. అయితే తమ లైంగిక కోరికలు తీర్చుకునే విషయంలో జంటలు ఈ నిబంధన పాటించడం లేదు. తమ భాగస్వాములతో లైంగికానందం పొందడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. సెక్స్ సంబంధించిన ఉత్పత్తుల అమ్మకాలు పెరగడమే దీనికి నిదర్శనం.

   

Tags:    

Similar News