అపర కోటీశ్వరుడికి చుక్కలు చూపిస్తున్నారు అక్కడ

Update: 2021-03-13 06:54 GMT
చైనా .. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదగాలనే లక్ష్యంతో అనేక మార్పులకి శ్రీకారం చుడుతూ , అగ్రరాజ్యంగా వెలుగొందుతోన్న అమెరికా తో కయ్యానికి కాలుదువ్వవుతుంది. ఇదిలా ఉంటే .. పక్క దేశాలపైనే కాదు , తమ దేశంలోని  బిలియ‌నీర్ , చైనా ఈ-కామర్స్‌, టెక్నాలజీ దిగ్గజం అలీబాబా మార్కెట్‌ గుత్తాధిపత్య నిబంధనల ఉల్లంఘించిందన్న కారణంగా ఈ గ్రూప్‌పై ఏకంగా 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7,300 కోట్లు) జరిమానా విధించాలని  చైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

గ‌తంలో అమెరికా చిప్ త‌యారీ సంస్థ క్వాల్ ‌కామ్‌ పై 97.5 కోట్ల డాల‌ర్ల జ‌రిమానా విధించింది చైనా. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇదే అత్య‌ధికంగా కాగా.. ఇప్పుడు అలీబాబాపై అంత‌కుమించి ఫైన్ వేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. అయితే ఈ వార్త‌ల‌పై అలీబాబా ఇప్ప‌టి వ‌ర‌కూ అధికారికంగా స్పందించ‌లేదు. చైనా నియంత్ర‌ణ సంస్థ‌ల‌పై గ‌తేడాది అక్టోబ‌ర్‌లో అలీబాబా ఫౌండ‌ర్ జాక్ మా చేసిన వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. అప్పటి నుండి చైనా తమ దేశ బిలియనీర్ జాక్ మాను వేధింపులకు గురిచేస్తూనే వుంది. ఆ వ్యాఖ్యల కారణంగానే  రెండు నెల‌ల పాటు జాక్ మా కూడా క‌నిపించ‌కుండా పోయిన విష‌యం తెలిసిందే.అలీబాబాకు చెందిన ఫిన్‌టెక్‌ కంపెనీ యాంట్‌ గ్రూప్‌ ఐపీఓను  చైనా ప్రభుత్వం గత ఏడాది నవంబరులో అర్ధంతరంగా నిలిపివేసింది. 
Tags:    

Similar News