ఎప్పుడూ కేంద్రంతో ఘర్షణాత్మకంగా వ్యవహరించే దిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి తన వైఖరిని కొనసాగించారు. ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ పేరిట ఏర్పాటు చేసిన ‘టాక్ టు ఏకే’ కార్యక్రమంలో తన మాటల తూటాలను ఎక్కుపెట్టారు. మోదీ ‘మన్ కీబాత్’ తరహాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి దిల్లీ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దీనికి కేజ్రీవాల్ ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూనే తనదైన శైలిలో కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
* దిల్లీని కేంద్రం భారత్-పాక్ తరహాగా మార్చేసిందని - తమ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
* తమ ప్రభుత్వం నిజాయతీగా ఉండడం కేంద్రానికి మింగుడు పడడం లేదని, ఈ విషయంలో జైలు కెళ్లేందుకైనా సిద్ధంగా ఉండాలని తమ ఎమ్మెల్యేలకు సూచించామని చెప్పారు.
* గుజరాత్ ప్రజలు కోరుకుంటే రానున్న ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. దీనిపై ఆ రాష్ట్రంలో రెండు మూడు సభలు ఏర్పాటు చేసి అనంతరం ప్రజల కోరిక మేరకు పోటీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
* సరి-భేసి విధానం రెండో విడత చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది శీతకాలంలో మరోసారి ఈ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నామన్నారు.
* ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. విద్యాభివృద్ధి కోసం బడ్జెట్లో కేటాయింపులను రెట్టింపు చేశామని తెలిపారు.