దక్షిణాదిన పాగా వేయాలని ఆశలు పడుతున్న బీజేపీకి పెద్ద షాకే తగిలింది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రమై న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎలాగైనా పాగావేయాలని.. అధికారంలోకి వచ్చేంత సీన్ లేకపోయినా.. అసలు బీజేపీ అంటూ.. ఒక పార్టీ ఉందని నిరూపించుకోవాలని కమల నాథు లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత అధికార పార్టీ అన్నాడీఎంకేతో పొత్తుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి, తెలంగాణ నాయకుడు కిషన్ రెడ్డి రంగంలోకి దిగి... పొత్తుకు సంబంధించి వరుస చర్చలు జరిపారు. మొత్తం తమకు 60 స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
వాస్తవానికి అన్నాడీఎంకే, బీజేపీ పార్టీల నడుమ దాదాపు ఎనిమిది రోజులపాటు వరుస చర్చలు సాగాయి. తమకు 60 స్థానాలను కేటాయించాల్సిందేనని కమల నాథులు పట్టుబట్టారు. అంతేకాదు. ఈ ఎన్నికలతో పాటు జరుగుతున్న కన్యాకుమారి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక టికెట్‌ను కూడా తమకు కేటాయించాల ని పట్టుబట్టారు. అయితే.. కన్యాకుమారి టికెట్ ఇచ్చేందుకు అన్నాడీఎంకే సారథులు పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు పచ్చజెండా ఊపినా.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 15మించి బీజేపీకి కేటాయిం చేది లేదని కుండబద్దలు కొట్టారు. అయితే.. ఈ విషయంలో ఎడతెగని చర్చలు చేపట్టిన బీజేపీ చివరాఖరుకు 20 స్థానాలను దక్కించుకుంది.
అయితే. ఈ పరిణామంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ.. కీలక నాయకులు ఉన్న పార్టీకి కేవలం 20 స్థానాలు కేటాయించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇదేనా బీజేపీ స్థానం... అన్నాడీఎంకే ఇంత వరకే పరిమితం చేసిందా? అనే ప్రశ్నలు కూడా తెరమీదికి వస్తున్నాయి. ఇక, ఇదే సమయంలో అన్నాడీఎంకే కూటమిలోని ప్రాంతీయ పార్టీ పీఎంకేకు 23 సీట్లు కేటాయించడం గమనార్హం. జాతీయ పార్టీగా ఉన్న తమకు అంతకంటే ఎక్కువ సీట్లు లభిస్తాయని ఆశపడ్డ బీజేపీ నేతలకు నిరాశే మిగిలింది. ఇక, ప్రధాన పార్టీ అన్నాడీఎంకే 170కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేస్తుండడం గమనార్హం.