హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు?

Update: 2021-08-12 12:30 GMT
హుజూరాబాద్ లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారయ్యారు. ఉద్యమ నాయకుడు అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను కేసీఆర్ ఖరారు చేశాడు. ఇక ప్రతిపక్ష బీజేపీ నుంచి ఈటల రాజేందర్ అందరికంటే బలమైన అభ్యర్థిగా ఉన్నాడు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే హుజూరాబాద్ లో  పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ కూడా ఎక్కడా తగ్గకూడదని డిసైడ్ అయ్యింది. నియోజకవర్గంలో దళిత, బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గం నుంచే టీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఇరు పార్టీలు పలు పేర్లు పరిశీలించిన తరువాత కొందరిపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల ఇప్పటికే పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. మోకాలి నొప్పితో కొంత గ్యాప్ ఇచ్చినా మళ్లీ మొదలు పెడుతున్నట్లు ప్రకటించాడు. దీంతో బీజేపీ నుంచి ఈటల పోటీ ఖాయమేనని తెలుస్తోంది. తనను ప్రభుత్వం నుంచి భర్తీ చేసినందుకు ప్రజలే ఆదరిస్తారంటూ ముందుకు వెళ్తున్నారు. ఈటల పాదయాత్రకు కొందరు మద్దుతు ఇస్తూ ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తాను చేయబోయేది చెబుతున్నాడు.

ఇక టీఆర్ఎస్ ఇప్పటికే దళిత బంధు పథకంలో ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నియోజకవర్గానికి చెందిన నేతకే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. మరోవైపు దళిత కాలనీల్లోప్రత్యేక అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. అయితే మొన్నటి వరకు కౌశిక్ రెడ్డి పార్టీలో చేరడంతో ఆయనకే టికెట్ కన్ఫామ్ అని అనుకున్నారు. కానీ ఆయనకు ఎమ్మెల్సీ ఖరారు చేయడంతో  ఉద్యమకారుడు, బీసీ అయిన టీఆర్ఎస్వీ నేత గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్థిగా ఖరారు చేశారు..

ఈ పరిణామాల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై పార్టీ నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈటలకు సరైన నాయకుడిని రంగంలోకి దించాలని ప్రణాళిక వేస్తున్నారు. అయితే ఇప్పటికే దళిత అభ్యర్థినే పోటీలో ఉంచాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. ఇందులో భాగంగా దామోదర రాజనర్సింహ పేరు వినిపించింది. కానీ ఆయన పోటీలో లేనని ప్రకటించారు. ఇక ఆ తరువాత కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, వరంగల్ కు చెందిన దొమ్మాటి సాంబయ్య పేర్లు వినిపించాయి.

కానీ అనూహ్యంగా కొండా దంపతుల పేర్లు వినిపిస్తున్నాయి. వైఎస్ అభిమానులుగా మొదటి నుంచి పార్టీలో కొనసాగిన కొండా దంపతులు మధ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో కాంగ్రెస్ తరుపున గెలిచిన కొండా సురేఖ ఆ తరువాత గులాబీ పార్టీలో చేరి 2018లో టికెట్ దక్కించుకోలేకపోయారు. దీంతో తిరిగి కాంగ్రెస్లోకి మారారు. తాజాగా రేవంత్ రెడ్డి అధ్వర్యంలో పార్టీలో ఊపు రావడంతో హుజూరాబాద్ టికెట్ కోసం కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ బరిలో దిగనుందా..? అనే ప్రచారం సాగుతోంది.

బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ కాంగ్రెస్ ఎమ్మేల్యేగా చేశారు.ఆమె భర్త కొండా మురళి ఎమ్మెల్సీగా కొనసాగారు. వరంగల్ రాజకీయాలను శాసించిన వీరు టీఆర్ఎస్ హయాంలో మాత్రం స్తబ్ధంగా ఉండిపోయారు. పరకాల నియోజకవర్గాన్ని కొన్ని సంవత్సరాలు కొండా సురేఖ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏలారు. ఆ నియోజకవర్గాన్ని ఆనుకొని ఉండే హుజూరాబాద్ లోనూ ఆమె ప్రాభవం ఉంది. అందుకే ఇప్పుడు కొండా సురేఖను బరిలోకి దించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కాగానే వారిలోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తే పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్లు కొండా దంపతులు సంకేతాలు పంపినట్లు సమాచారం. దీనికి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

బలమైన నేతగా పేరున్న కొండా సురేఖతో పద్మశాలి, మున్నూరు కాపు సామాజికవర్గాల ఓట్లు పడుతాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే సురేఖను దించడం దాదాపు ఖాయమని అంటున్నారు.
Tags:    

Similar News