హైద‌రాబాద్ గ‌ణేషుడికి ఎన్ని క‌ష్టాలో...

Update: 2015-08-17 01:58 GMT
హైదరాబాద్ లో వినాయకుడి నిమజ్జనం ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. పర్యావరణాన్ని రక్షించడానికి హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని కొందరు కోరుతున్నారు. సాంప్రదాయ వాదులు మాత్రం ఆనవాయితీని ఫాలో కావాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. ఈ సమస్య.. చినికి చినికి గాలి వానలా మారి… చివరకు హైకోర్టు మెట్లెక్కింది.

బెంగళూర్ లో వినాయకుడి నిమజ్జనం చాలా సింపుల్ గా జరుగుతుంది. లోతుగా తవ్విన గుంతల్లో… ప్లాస్టిక్ కవర్లు పరిచి… నీళ్లను నింపి… అందులోనే గణపతులను నిమజ్జనం చేస్తుంటారు. టెంపరరీగా తవ్విన గుంతలలో వినాయకులను నిమజ్జనం చేయడంతో  పర్యావరణ సమస్య ఉండదని భావిస్తున్నారు అక్కడి అధికారులు. ఆ తరువాత.. మరో గుంతను తవ్వి వెస్టేజ్ ను అందులో పూడుస్తున్నారు అధికారులు. ఈ నేప‌థ్యంలో గణేషుడు, దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో జలవనరులు కలుషితం కాకుండా చూడాలన్న డిమాండ్‌తో మ‌న‌రాష్ర్టానికి చెందిన కొంద‌రు హైకోర్టులో పిటిషన్ వేయ‌డంతో ఇష్యూ మరింత హీటెక్కింది.

బెంగుళూర్ లో వినాయకుల విగ్రహాల నిమజ్జనంపై స్టడీ చేయాలని ధర్మాసనం సూచించడంతో…. వివాదం మరోసారి ఆసక్తికరంగా మారింది. గ‌ణేష్ ఉత్సవాలు అగ్రవర్ణాలకు ఫ్యాషన్ గా మారాయంటున్నారు ప్రకృతి ప్రేమికులు. భక్తి భావం తగ్గి విగ్రహాలను ఎత్తు పెంచడంలో పోటీ పడి పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారని ఫైరవుతున్నారు. మట్టి విగ్రహాలను నెలకొల్పి ప్రకృతిని పరిరక్షించాలని… బెంగళూరు టైపు నిమజ్జనంతో నేచర్ కు మంచి జరుగుతుందంటున్నారు. వినాయకుల నిమజ్జనంలో నిజామాబాద్ జిల్లా ప్రజలు ముందున్నారంటున్నారు హేతువాదులు. వందల ఏళ్లుగా బావిలో వినాయకులను నిమజ్జనం చేస్తుండటం వల్ల పర్యావరణాన్ని కాపాడినవారవుతున్నారని అంటున్నారు.

అయితే లేటెస్ట్ గా… వినాయకుడి నిమజ్జనం సమస్యను తెరపైకి తీసుకురావడంపై హిందు సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు. దైవభక్తి లేని కొందరు తప్పుడు సమాచారంతో కోర్టు విలువైన సమయాన్ని వేస్ట్ చేస్తున్నారని… బెంగళూరులాగా ఆర్టిఫీషియల్ గా తయారు చేసిన గుంతలలో గణేష్ నిమజ్జనం చేయడం సాంప్రదాయలకు విరుద్దమని అంటున్నారు. 

ఇందిరాపార్క్ లో వినాయక్ సాగర్ ఏర్పాటుచేసి… నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వం చొర‌వపై ప‌లు ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నాయి.
Tags:    

Similar News