హుస్సేన్ సాగర్ అయ్యింది జైశ్రీరాం సాగర్

Update: 2019-10-20 05:49 GMT
హైదరాబాద్ కు ఐకానిక్ ‘హుస్సేన్ సాగర్’. అందులోని బుద్ద విగ్రహం ఫేమస్.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ సరస్సు పేరును టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మార్చేసింది. తాజాగా గూగుల్ మ్యాప్ లో హుస్సేన్ సాగర్ పేరును ‘జై శ్రీరాం సాగర్’గా మార్చేశారు. గూగుల్ మ్యాప్ లో కొడితే ఈ పేరే కనిపిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

ప్రఖ్యాత హుస్సేన్ సాగర్ పేరు ను ‘జై శ్రీరాం సాగర్ ’గా గూగుల్ మార్చడంపై కొందరు నెటిజన్లు మండిపడ్డారు. ట్విట్టర్ లో షేర్ చేసి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సరస్సు ను జై శ్రీరాం సాగర్ గా మార్చేశారనే యాష్ ట్యాగ్ తో నెటిజన్లు గూగుల్ పై మండిపడుతున్నారు.

కొందరు  దుందుడుకు నెటిజన్లే ఇలా గూగుల్ మ్యాప్స్ లో హుస్సేన్ సాగర్ పేరును ‘జైశ్రీరాం సాగర్’గా మార్చినట్టు తెలిసింది. దీన్ని గుర్తించిన గూగుల్ కూడా దిద్దుబాటు చర్యలకు దిగుతోంది.

తాజాగా గూగుల్ ప్రతినిధి ఈ వివాదంపై స్పందించాడు. లోకల్ గా పేరొందిన స్తలాలు, ప్రదేశాలను గుర్తించడానికి వినియోగదారులకు యాక్సెస్ ఇస్తామని.. కానీ కొందరు హుస్సేన్ సాగర్ ను జై శ్రీరాంసాగర్ గా తప్పుగా సవరణలు చేసి ఇలా మార్చేశారని వివరణ ఇచ్చాడు. ప్రజలు, మతం మనోభావాలు దెబ్బతినే ఇటువంటి చర్యలను తాము సహించమని దీన్ని వేగంగా పరిష్కరిస్తామని గూగుల్ ప్రతినిధి తెలిపారు.

ఇక కొందరు మతతత్వ నెటిజన్లు గత ఫిబ్రవరిలోనే ‘సాలార్ జంగ్ పూల్ ’ను కూడా చత్రపతి శివాజీ బ్రిడ్జిగా మార్చేశారు. ఇక మూసీ నదిని ముచ్కుంద పేరుతో  మార్చేసి దుమారం రేపారు.

1563లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించిన హైదరాబాద్ లోని  హుస్సేన్ సాగర్ కు ఎంతో చరిత్ర ఉంది. గుండె ఆకారంలో ఉండే ఈ మంచినీటి సరస్సు హైదరాబాద్ వాసుల తాగునీటి అవసరాలు ఒకప్పుడు తీర్చేది. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక 1992లో ఈ హుస్సేన్ సాగర్ లో పెద్ద ఏకశిలా గౌతమ బుద్దుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈ చారిత్రక సరస్సు పేరునే మార్చేయడం హాట్ టాపిక్ గా మారింది.

    

Tags:    

Similar News