డేటింగ్ యాప్ ‘టిండర్’ గురించి తెలుసుగా.. అందులో మనకు నచ్చిన అమ్మాయి.. మనల్ని నచ్చిన అమ్మాయితో డేటింగ్ చేసుకోవచ్చు. దీంతో ఈ యాప్ అంటే ఇప్పుడు యువతలో పిచ్చ క్రేజ్. డేటింగ్ పేరిట సాగుతున్న ఈయాప్ ను ఆయుధంగా వాడి ఓ సీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి లక్షలు వసూలు చేసిన వైనాన్ని పోలీసులు నిగ్గుతేల్చారు.
డేటింగ్ యాప్ టిండర్ లో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఇన్ స్టాగ్రామ్ నుంచి యువతుల ఫొటోలు అప్ లోడ్ చేసి వారిని ఆధారంగా సెక్స్ చాట్, న్యూడ్ ఫొటోలు పంపుతానంటూ అబ్బాయిల వద్ద లక్షలు వసూలు చేసిన సీఏ విద్యార్థి ఆట కట్టైంది.
ఏడాదిగా యువతుల ఫొటోలతో టిండర్ యాప్ లో పలువురిని మోసం చేస్తూ దాదాపు 20లక్షల రూపాయలు వసూలు చేసిన సీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి వెన్నెల వెంకటేశ్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇతడు అనేక మందిని యువతుల మాదిరిగా మోసం చేసి 20 లక్షలు వసూలు చేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
విజయనగరం జిల్లాకు చెందిన వెన్నెల వెంకటేశ్ విజయవాడలో చదివాడు. ప్రస్తుతం సీఏ ఫైనల్ ఇయర్ కోసం హైదరాబాద్ వచ్చాడు.చార్టెడ్ అకౌంటెంట్ గా మారేలోపే డబ్బు సంపాదించాలని భావించిన వెంకటేశ్ టిండర్ డేటింగ్ యాప్ వరంగా దొరికింది. అందులో యువతుల పేరిట ఖాతాలు తెరిచి ఇన్ స్టాగ్రామ్ ఫొటోలు డౌన్ లోడ్ చేసుకొని వాటిని వినియోగించి వేర్వేరు పేర్లతో డేటింగ్ యాప్ టిండర్ లో ప్రొఫైల్స్ క్రియేట్ చేసేవాడు. తనతో చాట్ చేయడానికి వాట్సాప్ నెంబర్ ఇచ్చాడు. యువతిలా వారితో చాట్ చేసేవాడు. న్యూడ్ ఫొటోలు, వీడియోలకు రూ.500 తన బ్యాంకు ఖాతాకు పంపమనేవాడు. అంగీకరించిన వారు వెంకటేశ్ ఖాతాకు డబ్బు పంపేవారు. అయితే ఆ తర్వాత మోసం చేసేవాడు. తక్కువ మొత్తం చెబితే పరువు పోతుందని చాలా మంది సైలెంట్ గా ఉండిపోయారు.
ఏడాదిగా ఇతగాడి మోసాలు పెరిగి ఏకంగా రూ.20లక్షల వరకూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలానే ఓ యువతి ఫొటోతో టిండర్ లో వెంకటేశ్ ఖాతా తెరిచాడు. అయితే ఆ యువతికి ఇటీవల నిశ్చితార్థం కావడం.. ఆ యువతి ఫొటోను టిండర్ డేటింగ్ యాప్ లో చూసిన కాబోయే వరుడు పెళ్లి రద్దు చేశాడు.
దీంతో టిండర్ లో తన ఫొటో పెట్టడంపై యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు వెంకటేశ్ పని ఇదంతా అని అతడిని అరెస్ట్ చేశారు. ఇలా 20 లక్షల రూపాయలు వసూలు చేశాడని.. చాలా మంది యువతుల ఫొటోలు వాడాడని విచారణలో తేలింది.