చెడిపోయిన ఎల్ ఈడీ టీవీకి వారిద్దరూ బాధ్యులే..వినియోగదారుల కోర్టు తీర్పు!
ఒక వస్తువు కొనేందుకు వెళ్లిన వేళలో.. సదరు షాపులోని వారు చెప్పే తియ్యటి మాటలు అన్ని ఇన్ని కావు. కాలం ఖర్మం బాగోక.. సదరు వస్తువు చెడిపోతే.. అమ్మినోళ్లు తమకు సంబంధం లేదని తేలిస్తే.. సదరు కంపెనీని ఎలా కాంటాక్టు కావాలో ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితే హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తికి ఎదురైంది. దీంతో.. అతగాడు ఓపికతో న్యాయపోరాటానికి దిగారు. తాజాగా రంగారెడ్డి వినియోగదారుల కోర్టు ఇచ్చిన తీర్పు చూసినప్పుడు.. వినియోగదారులకు ఊరటను ఇవ్వటమే కాదు.. అసలేం చేయాలో అర్థమయ్యేలా చేసిందని చెప్పాలి.
హైదరాబాద్ లోని మన్సురాబాద్ కు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి 2016 జూన్ లో వనస్థలిపురంలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఫిలిప్స్ ఎల్ ఈడీ టీవీ కొనుగోలు చేశాడు. దీనికి మూడేళ్లు వారంటీ ఉందని టీవీ అమ్మే సమయంలో షాపులోని వ్యక్తి చెప్పారు. ఓకే అని చెప్పిన కొనుగోలు చేసిన సత్యనారాయణకు 2017 జూన్ 18న సదరు టీవీ షాకిచ్చింది. పని చేయకుండా ఆగింది. దీంతో.. బజాజ్ షోరూంకు వెళ్లి కంప్లైంట్ చేశాడు. రిపేరుతో తమకు సంబంధం లేదని.. టీవీ తయారు చేసిన కంపెనీకి సంబంధించిన పీఈ ఎలక్ట్రానిక్స్ ను సంప్రదించాలని చెప్పారు.
దీంతో.. సదరు సత్యానారాయన ఆ పని కూడా చేశారు. సదరు సర్వీసు కంపెనీ రిపేర్ చేసింది. సరిగ్గా మళ్లీ ఏడాదికి అంటే.. 2018 జూన్ 29న టీవీ పాడైంది. మళ్లీ షోరూంకు వెళ్లి కంప్లైంట్ చేశాడు. ప్రస్తుతం తమకు ఆ కంపెనీతో డీలర్ షిప్ లేదని.. అందుకే తాము ఏమీ చేయలేమని చెప్పారు. దీంతో.. తాను టీవీ కోసం చెల్లించిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేయాలని కోరుతూ బజాజ్ ఎలక్ట్రానిక్స్ తో పాటు.. పీఈ ఎలక్ట్రానిక్స్ కు లీగల్ నోటీసులు పంపారు.
ఈ కేసుకు సంబంధించిన వాదనలు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కోర్టు జరిగాయి. తాము వస్తువుల్ని అమ్మటం వరకే బాధ్యులమని వాదించారు. ఫిలిప్స్ తోపాటు అనేక బ్రాండ్లు అమ్ముతామని.. తయారీ లోపాలకు తాము బాధ్యులం కామని చెప్పారు. ఒకసారి అమ్మిన వస్తువుల్ని తిరిగి తీసుకునేది లేదని చెప్పారు. గ్యారెంటీ బాధ్యత తయారీ సంస్థదేనని బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాదించింది. కోర్టు నోటీసులకు తయారీ కంపెనీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో కోర్టు తన తీర్పును ఇచ్చింది. టీవీ తయారీ కంపెనీతో పాటు.. అమ్మిన బజాజ్ ఎలక్ట్ట్రానిక్స్ కూ బాధ్యత ఉందని తేల్చింది. సదరు వ్యక్తికి తిరిగి టీవీ ఇవ్వటం కానీ.. అతను చెల్లించిన రూ.47,999 తిరిగి ఇవ్వాలని పేర్కొంది. నెల వ్యవధిలో తమ తీర్పును అమలు చేయని పక్షంలో రూ.5వేలు చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఫోరం స్పష్టం చేసింది. సో.. మీరు కొనే ఎలక్ట్రానిక్ వస్తువు చెడిపోతే.. దానికి తయారీ కంపెనీ మాత్రమేకాదు.. వస్తువు అమ్మిన కంపెనీ కూడా బాధ్యులే అన్న విషయం కోర్టు తీర్పు పుణ్యమా అని అందరికి అర్థం కావటం ఖాయం.