హైదరాబాద్ అంటే మహా నగరమన్నమాటే కాదు.. ట్రాఫిక్ నరకానికి కేరాఫ్ అడ్రస్ చెప్పాలి. ట్రాఫిక్ కష్టాల్ని అధిగమించేందుకు ఉన్న ఒకే ఒక్క మార్గంగా మెట్రో రైల్ గా చెబుతుంటారు. నగరంలో మెట్రో రైల్ ఎప్పుడు పరుగులు పెడుతుందా? అని నగరజీవి కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. స్టేషన్ల నిర్మాణం పూర్తి అయినప్పటికీ మెట్రో పరుగులు తీయకపోవటంపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు.
అయితే.. ఇక అసంతృప్తి లేనట్లే. ఎందుకంటే.. ఎంతోకాలంలో ఆశగా ఎదురుచూస్తున్న మెట్రో రైల్ అధికారికంగా పట్టాలు ఎక్కించేందుకు ముహుర్తాన్ని డిసైడ్ చేసేశారు. అది కూడా ఊహించిన దాని కంటే ఎక్కువ మార్గంలో మెట్రో రైలు పరుగులు తీసేలా తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్లాన్ చేసింది. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం మియాపూర్ టు ఎస్సార్ నగర్.. నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు మాత్రమే మెట్రోరైల్ పరుగులు తీస్తుందని చెప్పేవారు.
ఇప్పుడు అందుకు భిన్నంగా మియాపూర్ టు ఎస్సార్ నగర్ కు 11 కిలోమీటర్లు.. నాగోల్ నుంచి బేగంపేట మధ్యనున్న 16 కిలోమీటర్ల మధ్యన మెట్రో రైల్ ను నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2ను ముహుర్తంగా ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎస్ పి సింగ్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సీఎస్.. ఇతర ముఖ్య అధికారులు నాగోల్ టు బేగంపేట మధ్యన జరుగుతున్న మెట్రో పనుల్ని.. మెట్రో స్టేషన్లను క్షుణ్ణంగా పరిశీలించటమే కాదు.. జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ జూన్ 2కు ఎట్టిపరిస్థితుల్లో మెట్రో రైలు పరుగులు తీయటం ఖాయమని చెబుతున్నారు. హైదరాబాదీకి ఇంతకు మించిన స్వీట్ న్యూస్ మరొకటి ఉండదని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/