మెట్రో టికెట్ మినిమం ఎంతో తెలుసా?

Update: 2017-09-21 04:42 GMT
హైద‌రాబాదీయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానుంది. న‌వంబ‌రు 28 నుంచి 30 లోపు ఏదో ఒక రోజు మెట్రో స‌ర్వీసులు ప్ర‌జ‌ల చెంత‌కు రానున్నాయి. ఎంతోకాలంగా మెట్రో ఎక్కాల‌న్న న‌గ‌ర‌జీవి క‌ల నిజం కానుంది.

మ‌రి.. మెట్రో టికెట్ ఎంత ఉంటుంది? అన్న సందేహం ఎప్ప‌టి నుంచో న‌గ‌ర ప్ర‌జ‌ల్ని వెంటాడుతోంది. అత్యాధునిక సాంకేతిక‌త‌తో సిద్ధం చేస్తున్న మెట్రో టికెట్ సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా? ఆకాశాన్ని అంటేలా ఉంటుందా? అన్న సందేహం ప‌లువురిని ప‌ట్టి పీడిస్తోంది. తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం మెట్రో రైల్ టికెట్‌ను మినిమంగా ఫిక్స్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో హైద‌రాబాద్ మెట్రో అధికారులు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఉన్న మెట్రో స‌ర్వీసుల ఛార్జిల‌ను అధ్య‌య‌నం చేసిన అధికారులు హైద‌రాబాద్ మెట్రో మినిమం టికెట్‌ను రూ.10 ఫిక్స్ చేయ‌నున్న‌ట్లుగా స‌మాచారం.

షెడ్యూల్ ప్ర‌కారం మెట్రో రైల్ మ‌రింత ముందే ప‌ట్టాల‌కు ఎక్కాల్సి ఉంది. మ‌ధ్య‌లో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో ఇంత ఆల‌స్య‌మైంది. మొద‌ట అనుకున్న ప్ర‌కారం అయితే 2015 నాటికి మెట్రో స‌ర్వీసులు అందుబాటులోకి వ‌స్తే క‌నుక మినిమం టికెట్ రూ.8 చేయాల‌ని భావించారు. అయితే.. ఆల‌స్యం కావ‌టంతో పెరిగిన ధ‌ర‌ల‌కు త‌గ్గ‌ట్లుగా మినిమం ధ‌ర‌ను కూడా స‌వ‌రించాల‌ని డిసైడ్ అయ్యారు.

ఇందులో భాగంగా టికెట్ ధ‌ర ఎంత ఉంటే ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్యంగా ఉండ‌టంతో పాటు.. ఎక్కువ‌మంది మెట్రో ఎక్కేందుకు ఆస‌క్తి చూపిస్తార‌న్న అంశంపై దృష్టి పెట్టిన మెట్రో అధికారులు మినిమం టికెట్ రూ.10 మ్యాగ్జిమం రూ.40 వ‌ర‌కూ ఉండాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. తొలిద‌శ‌లో మియాపూర్ నుంచి అడ్డ‌గుట్ట వ‌ర‌కూ మెట్రో స‌ర్వీసుల్ని అందుబాటులోకి తీసుకురానున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం న‌గ‌రంలో తిరుగుతున్న ఏసీ బ‌స్సుల కంటే మెట్రో టికెట్ చౌక‌గా ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అదే నిజ‌మైతే.. హైద‌రాబాదీకి అంత‌కంటే సంతోష‌క‌ర‌మైన వార్త మ‌రొక‌టి ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News