హైదరాబాద్ లో ఆక్సిజన్‌ సిలిండర్ల దందా... ఒక్కొ సిలిండర్ రూ .లక్ష !

Update: 2020-07-11 12:30 GMT
కరోనా వైరస్ కారణంగా ఒకవైపు ఆక్సిజన్ అందక చాలామంది చనిపోతున్నారు. అయితే , ఇదే సమయంలో కొందరు దొడ్డిదారిని ఆక్సిజన్‌ సిలిండర్లు అమ్ముతూ రూ. లక్షలు వెనుకేసుకొంటున్నారు. హైదరాబాద్ పోలీసులు ఈ ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న ముఠాల గుట్టు రట్టు చేశారు. . కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ డిమాండ్ ను కొంతమంది దళారులు ఇలా క్యాష్ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ లో అనుమతులు లేకుండా ఆక్సిజన్‌ సిలిండర్లు అమ్ముతున్న రెండు ముఠాలపై దాడి చేసిన పోలీసులు 34 ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.

పలు క్లీనిక్ ‌లు, ఆస్పత్రులు, వ్యక్తిగతంగా కొందరికి ఈ ముఠాలు ఆక్సిజన్‌ సిలిండర్లు అక్రమంగా ఎక్కువ రేట్స్ కి అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా ఒక్కొక్క సిలిండర్ ‌కు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కు అప్పగించామని తెలిపారు. నగరంలో సిలిండర్ల అమ్మకాల పై దృష్టి సారించామని, అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో సిలిండర్ల అమ్మకాలపై నిఘా ఏర్పటు చేసామని తెలిపారు. అక్రమంగా సిలిండర్లు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు .

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో.. ఆక్సిజన్‌ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ ఇప్పటికే హెచ్చరించారు. సిలిండర్లను బ్లాక్‌ చేస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తుండటంతో శుక్రవారం రాత్రి సంబంధిత అధికారులతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. తనిఖీ కోసం డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ టాస్క్‌ఫోర్స్‌, ప్రజారోగ్య శాఖ, ఎక్స్‌ప్లోజివ్స్‌ డిప్యూటీ చీఫ్‌ కంట్రోలర్‌లతో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆక్సిజన్‌ సిలిండర్లను నిల్వచేసే ట్రేడర్లు ‘పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌’ నుంచి లైసెన్సు తీసుకోవాలని చెప్పారు.
Tags:    

Similar News