అమెరికాలో హత్యకు గురైన తెలుగు కుర్రాడు సంకీర్త్ కేసుకు సంబంధించిన మిస్టరీ ఇంకా వీడలేదు. సంకీర్త్ ను అతడి రూం మేట్ అయిన సందీప్ గౌడ్ హత్య చేసినట్లు భావిస్తున్నప్పటికీ.. అతను ఏ కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టాడన్నది తెలియడం లేదు. తమ కొడుకు స్నేహితుడైన ప్రణీత్ కూడా అసలేం జరిగిందన్నది సరిగా చెప్పడం లేదని సంకీర్త్ తల్లిదండ్రులు అంటున్నారు. అసలే బిడ్డ పోయిన దు:ఖంలో ఉన్న వారికి.. అసలు తమవాడిపై రూం మేట్ ఎందుకింత దారుణానికి పాల్పడ్డాడో తెలియక మరింత ఆవేదన చెందుతున్నారు.
హైదరాబాద్ లోని కాచిగూడకు చెందిన సంకీర్త్ ఇంజినీరింగ్ చదువుతుండగా.. విద్యానగర్ కు చెదిన ప్రణీత్ తో అతడికి స్నేహం ఏర్పడింది. వీళ్లిద్దరూ అమెరికాకు వెళ్లాక ఆస్టిన్ ప్రాంతంలో ఒకే అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. హైదరాబాద్ కే చెందిన సాయి సందీప్ గౌడ్ 15 రోజుల కిందటే వాళ్లుండే ఫ్లాట్ కు వచ్చాడు. ఐతే ఇంత తక్కువ సమయంలో సందీప్.. సంకీర్త్ ను చంపేసేంత స్థాయిలో వారి మధ్య ఏం గొడవ జరిగిందో అర్థం కావడం లేదు. సందీప్..సంకీర్త్ ను కత్తితో పొడిచి చంపాడు. ఆ సమయంలో ప్రణీత్ కూడా అదే గదిలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఇంతకీ గొడవేంటన్నది ప్రణీత్ చెప్పట్లేదు. ఏ పరిస్థితుల్లో సందీప్.. సంకీర్త్ ను పొడిచాడో వెల్లడించట్లేదు. మరోవైపు అమెరికా పోలీసులు.. సందీప్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రణీత్ ను వారు ఇప్పటికే విచారించి వదిలేశారు. వెంటనే ప్రస్తుతం తాను ఉంటున్న ప్రాంతం నుంచి ఖాళీ చేసి.. డాలస్ కు మకాం మార్చేసినట్లు సమాచారం. ప్రణీత్ తాము ఫోన్ చేసినా స్పందించట్లేదని.. ఏం జరిగిందో చెప్పట్లేదని సంకీర్త్ కుటుంబ సభ్యులు అంటున్నారు. మరోవైపు సంకీర్త్ మృతదేహానికి అమెరికాలో పోస్టుమార్టం పూర్తయింది. ఇంకో మూడు నాలుగు రోజుల్లో మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చే అవకాశముంది. సంకీర్త్ చనిపోయిన విషయం ఇప్పటిదాకా అతడి తల్లి రమాదేవికి చెప్పలేదు.