ఉద్య‌మంలో నేను కూడా పాల్గొన్నాః గంగుల‌

Update: 2021-05-18 13:30 GMT
తెలంగాణ ఉద్య‌మంలో తాను పాల్గొన‌లేద‌ని విమ‌ర్శిస్తున్న‌వారు త‌మ తీరు మార్చుకోవాల‌ని అన్నారు మంత్రి గుంగుల క‌మ‌లాక‌ర్. జిల్లా కేంద్రంలో జ‌రిగిన ఉద్య‌మంలో తాను పాల్గొన్నాన‌ని, త‌న‌పై కేసులు కూడా న‌మోద‌య్యాయ‌ని చెప్పారు.

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు మండ‌లాల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు, కార్య‌క‌ర్త‌లు గంగుల క‌మ‌లాక‌ర్ ను క‌లిశారు. టీఆర్ఎస్ పార్టీని వీడేది లేద‌ని, సీఎం కేసీఆర్ బొమ్మ‌మీద గెలిచామ‌ని, జెండా ఎజెండాలేని ఈట‌ల వెంట వెళ్లేది లేద‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి.. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మెజారిటీ ప్ర‌జాప్ర‌తినిధులు, కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ పార్టీవైపే ఉన్నార‌ని చెప్పారు. పార్టీని వీడేది లేద‌ని చెబుతున్న కార్య‌క‌ర్త‌ల ధైర్యం త‌మ‌కు ఎంతో ఉత్సాహం ఇస్తోంద‌ని అన్నారు.

టీఆర్ఎస్ పార్టీలో వ్య‌క్తులు ముఖ్యం కాద‌ని, ప‌నిచేసే వారంద‌రికీ త‌గిన గుర్తింపు ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పార్టీలోని ప్ర‌తి ఒక్క‌రూ న‌డుచుకోవాల్సిందేన‌ని అన్నారు క‌మ‌లాక‌ర్‌. మంత్రిని క‌లిసిన వారిలో ప‌లువురు పీఏసీఎస్ చైర్మ‌న్లు, స‌ర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.
Tags:    

Similar News