ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా తీస్తున్నట్లు ఆయన కుమారుడు బాలకృష్ణ ఏ ముహూర్తంలో ప్రకటించారో కానీ తొలి రోజు నుంచే రచ్చ మొదలైపోయింది. ఎన్టీఆర్ హయాం, ఆయన జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు మీడియా ముందుకొచ్చి.. ఆ సినిమా ఎలా తీయాలో నిర్దేశిస్తున్నారు.. ఏమైనా తేడాగా తీస్తే తాట తీస్తామంటున్నారు. కోర్టులకు వెళ్తామని కూడా ముందుగానే వార్నింగులు ఇస్తున్నారు.
మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు రీసెంటుగా బాలయ్యకు ఈ విషయంలో వార్నింగు ఇచ్చారు. బాలకృష్ణ తీయబోయే ఆ సినిమాలో తనను విలన్ గా చూపిస్తే మీడియా ముందుకు వచ్చి అసలు విషయాలు చెబుతానని హెచ్చరించారు. అంతేకాదు.. ఎన్టీఆర్ పై సినిమా తీస్తే అందులో హీరో పాత్ర తనదే అవుతుందన్నారు. టీడీపీని స్థాపించింది తానేనని నాదెండ్ల చెప్పారు.
సినిమాలో తనను విలన్ గా చూపిస్తే ఊరుకునేది లేదన్నారు. ఎన్టీఆర్ పై తీసే సినిమాలో చంద్రబాబునే విలన్ గా చూపించాలన్నారు. ఒక వేళ సినిమాలో తనను బాలకృష్ణ చెడుగా చూపిస్తే అప్పుడు ఎన్టీఆర్ గురించి మొత్తం బయట పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. బాలకృష్ణ ముందు తనను సంప్రదిస్తే సినిమా ఎలా తీయాలో చెబుతానన్నారు. చరిత్ర వక్రీకరించి కట్టుకథలు చేర్చి… తనను చెడుగా చూపిస్తే మాత్రం అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు.
కాగా ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లిన సమయంలో నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేశారు. కొద్దికాలం పాటు ముఖ్యమంత్రిగా కూడా చేశారు. అయితే పరిస్థితులు ఎదురుతిరగడంతో నాదెండ్ల పదవి నుంచి తప్పుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా ఇప్పటికే బాలయ్యకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో బాలయ్య ఈ టిపికల్ ఇష్యూస్ ను డీల్ చేస్తూ ఎన్టీఆర్ సినిమాను ఎలా తీస్తారన్నది చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/