కంగనా రనౌత్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆమె రెగ్యులర్ గా ఏదో ఒక విషయమై స్పందించడం.. అది వివాదాస్పదం అవ్వడం చాలా కామన్ గా మారిపోయింది. ఏం చేసినా కూడా ఆమె తీరు విభిన్నం అనే వారు ఉన్నారు. తాజాగా ఆమె కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కర్తవ్య పథ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంది.
ఆ సమయంలో కంగనా మాట్లాడుతూ గాంధీ మరియు నేతాజీ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి చిచ్చు రాజేసింది. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారంను రేపుతున్నాయి. నెటిజన్స్ రెండు వర్గాలుగా విడి పోయి మరీ చర్చించుకునే పరిస్థితి వచ్చింది.
కంగనా మాట్లాడుతూ.. నేను గాంధీవాదిని కాదు... నేను నేతాజీ వాదిని. అందుకే నేను మాట్లాడే మాటలు మరియు నా చర్యలు కాస్త కఠువుగా ఉండి చాలా మందికి ఇబ్బందిగా ఉంటాయి. నా యొక్క సొంత ఆలోచన అది. ప్రతి ఒక్కరికి వారి యొక్క సొంత ఆలోచన ఉండాలి.. ఉంటుంది. నేతాజీ మరియు సావర్కర్ వంటి అనేక మంది విప్లవ వీరులకు గుర్తింపు రాలేదు.
ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమని గాంధీజీ చెప్పారు. ఆయన నిరాహార దీక్ష.. దండి కవాతు వల్లే స్వాతంత్య్ర సాధ్యం అయిందని అంతా అంటున్నారు. కానీ లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు త్యాగం చేయడం వల్లే స్వాతంత్య్రం సాధ్యం అయ్యింది.
నేతాజీ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఒక సైన్యం ను తయారు చేశారు. అందువల్లే బ్రిటీష్ వారిపై ఒత్తిడి పెరిగి స్వాతంత్య్రం ఇచ్చారని కంగనా పేర్కొంది. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలను గాంధేయ వాదులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మొత్తానికి కంగనా మళ్లీ కొత్త చిచ్చు రాజేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.