నేను శాకాహారిని కాదు.. కోహ్లీ స్ట్రాంగ్ కౌంటర్

Update: 2021-06-02 03:30 GMT
ప్రపంచంలోనే గొప్ప ఫిట్ నెస్ ఉన్న క్రికెటర్ గా మన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పేరుంది. ఆహారం, నిద్ర, ఎక్సర్ సైజులు ఆఖరుకు నీళ్లను సైతం బ్రాండెడ్ వి.. కోట్లు ఖర్చు పెట్టి పౌష్టికరమైనవాటినే కోహ్లీ తింటాడని పేరుంది. అయితే కోహ్లీ పై ఈ విషయంలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి.

తాజాగా డైట్ విషయంలో కోహ్లీ తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించాడు. తాను శాకాహారిని అంటూ వస్తున్న విమర్శలకు ఘాటుగా బదులిచ్చాడు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో కోహ్లీ చిట్ టాట్ నిర్వహించాడు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నతో తన డైట్ కు సంబంధించిన విషయాలను వెల్లడించాడు.

తన డైట్ లో కురగాయాలు, గుడ్లు, కాఫీ, పప్పు, పాలకూర, దోసలు ఉంటాయని కోహ్లీ తెలిపాడు. కంట్రోల్ గా వీటన్నింటిని తీసుకుంటానని తెలిపాడు. ఇక విరాట్ కోహ్లీ గుడ్లు తింటానని అనడంపై ఫ్యాన్స్ ఆశ్యర్యపోయారు. మాంసం తినడం లేదని.. పూర్తిగా వెజిటేరియన్ గా మారనని గతంలో చెప్పిన కోహ్లీ ఇప్పుడిలా గుడ్లు తింటున్నాడని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

గత ఏడాది ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్ తో ఇంటర్వ్యూలో తన వెన్నుముఖ సమస్య కారణంగా మాంసాహారాన్ని మానేశానని కోహ్లీ తెలిపాడు. అయితే ఇప్పుడు గుడ్లు తింటానని అనడంతో కోహ్లీని ట్రోల్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News