జీవితం చాలా అందమైనది. ఈ ప్రయాణంలో కొన్ని సంఘటనలు జీవితాంతం నీడలా మనవెనుక వస్తూనే ఉంటాయి. వాటి వల్ల మనల్ని పూర్తిగా మార్చేస్తాయి. ఆ సంఘటనల నుంచి బయటపడటం చాలా కష్టం. అటువంటి దురదృష్టకర సంఘటనే తన జీవితంలోనూ జరిగిందని చెప్పుకొచ్చిందో పాప్ స్టార్. అయితే ఆసంఘటన తనను పూర్తిగా మార్చివేసిందని గతాన్ని గుర్తుచేసుకుంటోంది.
అత్యాచారం జరిగిన తరువాత మహిళలు చాలా తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తారు. దాని నుంచి తేరుకోవడమంటే జీవితాన్ని సరికొత్తగా ప్రారంభించడమే. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అనే సందేహం ప్రతిక్షణం కలుగుతుంది. కానీ దానినో పీడకలగా మరిచిపోయి సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. 19 ఏళ్ల వయసులో అత్యాచారానికి గురైన తర్వాత, ఆ పీడకల తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని పాప్ స్టార్ లేడీ గాగా చెప్పింది. టీనేజ్ లో తనపై అత్యాచారం జరిగిందని గతేడాది ఓ ఇంటర్వ్యూలో చెప్పిన లేడీ గాగా.. అప్పట్లో ఎంతో మానసికక్షోభ అనుభవించానని వెల్లడించింది.'నాపై అఘాయిత్యం జరిగాక చాలా ఏళ్లపాటు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఈ విషయాన్ని ఎలా మరిచిపోవాలో.. ఎలా జీర్ణం చేసుకోవాలో అప్పట్లో అర్థం కాలేదు. ఇందులో నా తప్పు ఉందా అన్న విషయం అర్థంకాలేదు. అయితే ఈ ఘటన నన్ను పూర్తిగా మార్చివేసింది. నా ఆలోచన విధానాన్ని మార్చింది. ఈ పీడకలను మర్చిపోయి మనోస్థైర్యంతో ముందుకుసాగా' అని లేడీ గాగా చెప్పింది.