నాకు ఓటు హ‌క్కు లేదు - నిమ్మ‌గడ్డ‌

Update: 2021-01-27 16:13 GMT
ఆంధ‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో త‌న‌కు ఓటు లేదు అని ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ చెప్పారు. పంచాయతీ ఎన్నిక‌ల్లో ఓటు వేయాల‌ని అనుకున్నాన‌ని, కానీ.. ఓట‌రు జాబితాలో త‌న పేరు లేద‌ని అన్నారు నిమ్మ‌గడ్డ‌.  బుధ‌వారం స్థానిక సంస్థ‌ ఎన్నిక‌ల విష‌యమై గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అయి వ‌చ్చిన త‌ర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

గుంటూరు జిల్లా దుగ్గిరాల త‌న స్వ‌స్థ‌ల‌మ‌ని అక్క‌డ ఓటు వేయాల‌ని భావించినా.. కుద‌ర‌లేద‌న్నారు. త‌న పేరును ఓట‌రు లిస్టులో చేర్చ‌మ‌ని కోరిన‌ప్ప‌టికీ.. అధికారులు అవ‌కాశం ఇవ్వలేద‌ని చెప్పుకొచ్చారు. తాను స్థానికంగా నివాసం ఉండ‌ట్లేద‌నే కార‌ణంతో త‌న పేరు ఓట‌రు జాబితాలో చేర్చ లేద‌న్నారు.

అయితే.. త‌న ఇల్లు దుగ్గిరాల‌లోనే ఉంద‌ని, అక్క‌డ త‌న‌కు పొలం కూడా ఉంద‌ని చెప్పారు క‌మిష‌న‌ర్‌. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా తాను అక్క‌డే స్థిర‌ప‌డ‌తాన‌ని చెప్పారు. 'దుగ్గిరాలలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశాను. కానీ.. అక్కడ ఉండట్లేదని తిరస్కరించారు. నా ఓటు హక్కును తిరస్కరించిన వారిపై నాకు కోపం లేదు. ఓటు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వేద్దామని అనుకున్నాను' అని చెప్పారు రమేష్ కుమార్.
Tags:    

Similar News