టీఆర్ ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత రెండో స్థానంలో ఎవరైనా ఉన్నారంటే మొదటగా గుర్తొచ్చే పేరు హరీష్ రావుదే. పార్టీకి ఏ సమయంలో తన సేవలు అవసరం వచ్చినా ముందుండి చక్కదిద్దడంలో హరీష్ రావు దిట్ట. కేసీఆర్ మార్గనిర్దేశంలో హరీష్ రావు క్లిష్టమైన పనులకు కూడా చక్కబెట్టేవారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డిని హరీష్ రావు పట్టుబట్టి ఓడించాడు. మహబూబ్ నగర్, మెదక్, గజ్వేల్ లో టీఆర్ ఎస్ ను ఒంటిచేత్తో గెలిపించారు. అసలు టీఆర్ ఎస్ లో హరీష్ కు ట్రబుల్ షూటర్ అనే పేరుంది. కాగా ఇప్పుడు ఆ ట్రబుల్ షూటర్ కే ట్రబుల్స్ వచ్చినట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
టీఆర్ ఎస్ అధికారంలోకి రావడానికి కేసీఆర్ పాటు హరీష్ రావు చాలా కష్టపడిన సంగతి తెల్సింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెనుకుండి కీలకపాత్ర పోషించింది హరీష్ రావే.. కిందటి సారి కేసీఆర్ క్యాబినెట్లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. అయితే గత కొంతకాలంగా టీఆర్ ఎస్ లో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గుతూ వస్తుండగా కేటీఆర్ ప్రాధాన్యత పెరుగుతూ పోతుంది.
తెలంగాణలో రెండోసారి టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక హరీష్ ను పక్కన పెడుతున్నారనే ప్రచారం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుబోయే క్యాబినెట్ కూర్పులో కూడా హరీష్ రావుకు చోటు దక్కలేదు. హరీష్ రావు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండగా మరోవైపు హరీష్ రావును వ్యూహాత్మకంగా పక్కనే పెడుతున్నారని చర్చ నడుస్తోంది.
అయితే ఇది పూర్తి క్యాబినెట్ విస్తరణ కాకపోవడంతో రెండో దఫాలో హరీష్ రావుకు అవకాశం దక్కుతుందని సమాచారం. ఈ దఫాలో హరీష్ రావుతోపాటు కేటీఆర్ కు కూడా మంత్రి పదవీ దక్కలేదు. అయితే కేటీఆర్ కు మాత్రం టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. కాగా హరీష్ రావు మాత్రం పార్టీ పదవీగానీ, మంత్రి పదవీగానీ దక్కపోవడం గమనార్హం. ఏదిఏమైనా ఎలాంటి పరిస్థితులైనా చక్కదిద్దే హరీష్ రావుకే ట్రబుల్స్ రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
హరీష్ మాత్రం తన వినయ విధేయతలను చాటుకున్నారు. మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యాక ‘తాను టీఆర్ ఎస్ లో క్రమశిక్షణ గల కార్యకర్తను అని.. రాజకీయ, కులసామాజిక సమీకరణాలను బేరీజే వేసుకొని కేసీఆర్ కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారని.. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా తాను చేస్తానని.. కేసీఆర్ పై పూర్తి నమ్మకం ఉందని.. అసంతృప్తి లేదని.. కొత్త మంత్రులకు శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొని టీఆర్ ఎస్ లో చెలరేగుతున్న దుమారాన్ని కాస్త తగ్గింప చేశారు.
మరి ఇంత లొల్లి జరుగుతున్నా హరీష్ కు జరిగిన అన్యాయం విషయంలో అటు కేసీఆర్ కానీ.. ఇటు కేటీఆర్ కానీ స్పందించకపోవడం చర్చనీయాంశమవుతోంది.