అప్పుడెప్పుడో హాస్య బ్రహ్మ బ్రాహ్మనందం నటించిన ఒక కామెడీ సీన్ గుర్తుండే ఉంటుంది. దొంగతనం చేసి దొరికి పోయిన బ్రహ్మీ పోలీసులతో నెల్లూరు పెద్దారెడ్డి తెలియకుండానే పోలీస్ అయ్యారా అంటూ దబాయిస్తుంటాడు. ఇప్పుడు సేమ్ టు సేమ్ అలాంటి దబాయింపే ఓ మాజీ కార్పొరేటర్ చేస్తున్నాడు. తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలుసని చెప్తూ తనకు బెయిల్ ఇవ్వాలని గదమాయించాడు. ఇది జరిగింది గుజరాత్ లోని వడోదరలో. ప్రధానమంత్రి, సీఎం తనకు చాలా క్లోజ్ అని చెప్పడానికి ఆయన ఏం ఆధారాలు చూపారో తెలుసా? ఆ ఇద్దరు ప్రముఖులతో దిగిన ఫొటోలు.
వడోదరలోని గాయత్రీనగర్ సొసైటీకి సంబంధించి కోట్లాది రూపాయల మేర జరిగిన ఫోర్జరీ కేసులో మాజీ కార్పొరేటర్ హషిత్ తలాటీపై కేసు నమోదు అయింది. అయితే ఆయన పరారీలో ఉండి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశాడు. ఈ సమయంలోనే చిత్రమైన వాదన చేశాడు. తాను వ్యాపారవేత్తనని, చాలా సంవత్సరాల పాటు బీజేపీలో ఉన్నానని తెలిపాడు. బీజేపీ కార్పొరేటర్ గా ఎన్నిక కావడంతో పాటు బీజేపీ అత్యున్నత నాయకులు కూడా తెలుసని, అందుకే బెయిల్ ఇవ్వాలని కోరాడు. బెయిల్ ఇవ్వడానికి వాళ్లు తెలిసుంటే చాలదని భావించిన సిటీ సెషన్స్ కోర్టు జడ్జి..అతడి బెయిల్ దరఖాస్తును తిరస్కరించారు. కాగా, మాజీ కార్పొరోటర్ తరఫు న్యాయవాది కౌశిక్ భట్ మాట్లాడుతూ నిందితుడు పారిపోడానికి ప్రయత్నించే వ్యక్తి కాదని నిరూపించేందుకే తాము కొన్ని ఫొటోలు చూపించినట్లు చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/