ఆమె ఒత్తిడితోనే రిజైన్ చేశార‌ట‌

Update: 2017-08-22 17:05 GMT
సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం స‌ర్టిఫికేష‌న్.. సింపుల్ గా చెప్పాలంటే సీబీఎఫ్‌సీ చీఫ్ ప‌ద‌వికి ప‌హ్ల‌జ్ నిహ్లానీ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. సెన్సార్ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న నిహ్లానీ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన ఆయ‌న కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

త‌న‌ను స్మృతి తీవ్ర ఒత్తిడికి గురి చేశార‌ని ఆరోపించారు. ఆమె త‌న‌ను టార్గెట్ చేయటంతోనే సెన్సార్ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న‌ట్లుగా ఆమె పేర్కొన్నారు. ఐఆండ్ బీ శాఖ త‌న‌ను టార్గెట్ చేసింద‌ని.. ఇందు స‌ర్కార్ చిత్రానికి తాను స‌ర్టిఫికేట్ ఇవ్వ‌క‌పోవ‌టంతో వివాదం మొద‌లైంద‌ని ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వ‌క‌పోవ‌టంతో.. ఎందుక‌లా చేశావ్ అంటూ మంత్రి స్మృతి త‌న‌కు ఫోన్ చేసి అడిగార‌ని.. అందుకు తాను సినిమా ట్రైబ్యున‌ల్ ను అనుస‌రిస్తున్న‌ట్లు చెప్పాన‌న్నారు. త‌న స‌మాధానంతో మంత్రికి కోపం వ‌చ్చింద‌న్న ఆయ‌న‌.. త‌న‌ను తొల‌గించార‌న్నారు.

అయితే.. ఆ సినిమాకు స‌ర్టిఫికేట్ ఇవ్వొద్ద‌ని అన్నివైపుల నుంచి ఒత్తిడి ఉంద‌ని.. అయిన‌ప్ప‌టికీ తాను 70 క‌త్తిరింపుల‌తో సినిమాకు స‌ర్టిఫికేట్ ఇచ్చిన‌ట్లుగా ఆయ‌న వెల్ల‌డించారు. తాజాగా ఆయ‌న మాట‌లు సంచ‌ల‌నంగా మారాయి. మ‌రి.. ఆయ‌న మాట‌ల‌పై స్మృతి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News