న్యాయపరంగా వరుస ఎదురుదెబ్బలు తింటున్న తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకున్ననిర్ణయం సరైనదని పేర్కొంటూ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయ అదనపు కార్యదర్శి.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ పై ఔట్ లుక్ పత్రిక ప్రచురించిన కథనానికి సంబందించి ఆమె పరువునష్టం దావా వేయటం తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించిన ఖర్చుల కోసం రూ.15లక్షలు ఇవ్వాలని తెలంగాణ సర్కారు నిర్ణయించి.. నిధులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆమెకు సంబంధించిన కేసు విషయంలో ప్రభుత్వ నిధులు వినియోగించాల్సిన అవసరం ఏందన్న ప్రశ్నకు రాష్ట్ర హైకోర్టు ఏకీభవించలేదు. ఆమెను ఒక తల్లిగా.. ఒక భార్యగా.. ఒక కూతురుగా కథనంలో పేర్కొనలేదని.. ఆమెను ఓ ఐఏఎస్ అధికారిణిగా పేర్కొన్నారన్న విషయం గుర్తు చేసిన కోర్టు.. ఈ కేసు ప్రైవేటు వ్యవహారం కాదని తేల్చి చెప్పింది.
స్మితా సబర్వాల్ పై ఔట్ లుక్ సంస్థ ప్రచురించిన కథనం ఆమె వ్యక్తిగతం కాదని తేల్చటంతో పాటు.. సదరు మీడియా సంస్థపై ఆమె వేసిన పరువునష్టం దావా కూడా ప్రైవేటు వ్యవహారం కాదని తేల్చేసింది. అంతేకాకుండా ఈ కేసు విషయంలో ఉన్న సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కేసు విచారణను న్యాయమూర్తి ఛాంబర్ లో నిర్వహిస్తున్నారు.